ప్రజా బలగం : రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గాయత్రి నగర్‌లో హ్యూమన్ రైట్స్ మహిళా హక్కుల తెలంగాణ కార్యదర్శి మరియు MRPS రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు బరిగల శోభారాణి గారి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బరిగల శోభారాణి గారు మాట్లాడుతూ, "సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అమూల్యమైనది. నేటి మహిళ ప్రతిఒక్క రంగంలో సత్తా చాటుతోంది. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సైన్స్, టెక్నాలజీ వంటి ప్రతి రంగంలో మహిళలు అగ్రగామిగా ఎదుగుతున్నారు. కానీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మహిళలు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులను మారుస్తూ మహిళల హక్కులను రక్షించేందుకు హ్యూమన్ రైట్స్ ఎప్పుడూ పాటుపడుతుంది" అని పేర్కొన్నారు.అలాగే, మహిళలు స్వయం సమృద్ధిగా ఎదగాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు మహిళా ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TDP తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచర్ల ప్రతిప్రబ గారు, BRS పార్టీ అనిత, పదమ, లక్ష్మి యాదవ్, BJP స్వప్న, ఇంద్ర సామాజిక కార్యకర్త, బడంగ్‌పేట కార్పోరేషన్ కాంగ్రెస్ అమృత నాయుడు, శోభా కురుమ, పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments