బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ BRS పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా...

 

అల్మాస్గూడ మాజీ సర్పంచ్ మరియు బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ BRS పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రజలు మరియు BRS పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదిన వేడుకల్లో స్థానిక నాయకులు, ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, మరియు అనేక మంది అభిమానులు పాల్గొని రామిడి రాంరెడ్డి గారి సేవలు, నాయకత్వం పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్బంగా రామిడి రామి రెడ్డి గారు మాట్లాడుతూ, తనకు అభిమానం చూపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, బడంగ్‌పేట్ మున్సిపల్ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.పార్టీ కార్యకర్తలు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ వేడుకలు ప్రాంతంలో మంచి ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. రామిడి రామి రెడ్డి గారి ప్రజా సేవా దృక్పథం ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిందని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ వేడుకలకు స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సీఈఓ మధుగాని రాణి గారు రామిడి రాంరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామిడి రాంరెడ్డి గారు ప్రజల అభివృద్ధి కోసం మరింత శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నారనీ, ఆయన నాయకత్వం భవిష్యత్తులో మరింత బలంగా కొనసాగుతుందనీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

Comments