ప్రజా బలగం : రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ బొక్క నరసింహ రెడ్డి గారి సూచన మేరకు కందుకూరు మండలంలో బాచుపల్లిగ్రామపంచాయతీ పరిధిలో గల 6-15 గ్రామకంఠంపొలము అన్యకాంతం కాకుండా శ్రీ బోక్క ఓం రెడ్డి మరియు ములంగి రామ్ రెడ్డి అడ్వకేట్స్ గారితో బాచుపల్లి గ్రామస్తులు (1)కొంతం యుగంధర్ రెడ్డి మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు (2) కందుకూరి శ్రీనివాస్ (3)చెవులపల్లికృష్ణ (4)దువ్వాసినరసింహ (5)ఎగిరిశెట్టి రాజు
గౌరవ హైకోర్టు లో పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్ (ఫైల్ నెంబర్.48/2024 ) దాఖలు చేయగా అట్టి విషయంపై గౌరవ హై కోర్ట్ సంబంధిత అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారిని రెండు నెలల వ్యవదిలో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశించడం జరిగిందని, కాగా ఇట్టి విషయంపై తాము గత 17 సంవత్సరాల నుండి అంబేద్కర్ సంఘం సభ్యులందరూ ఎంతగానో శ్రమించి తమ సొంత పనులను కూడా పక్కకు పెట్టి, ఎన్నో వడిదుడుకులను ఎదురుకుంటూ తమ గ్రామకంఠం పొలాన్ని గత 2006 సంవత్సరంనుండి నేటి వరకు ప్రతీ అధికారి గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు నిర్వీర్యమంగా తమ గ్రామ గోడు విన్నవించుకుంటూ తిరగడం జరిగిందని వారు తెలుపుతూ కాగా ఇట్టి విషయం పై చివరకు శ్రీ బొక్క ఓం రెడ్డి అడ్వకేట్ గారికి తెలుపగా వారు ఎలాంటి ఫీజు ఆశించకుండా మా గ్రామ ప్రజల పక్ష్యాన నిలబడి ఈ సమస్యను గౌరవ హైకోర్టు వారి దృష్టికి PIL రూపేణా తీసుకువెళ్లడం జరిగింది, కనుక బాచుపల్లి గ్రామస్తులందరు బొక్క ఓం రెడ్డి అడ్వకేట్ గారికి ఎంతో రుణపడి ఉంటామని గ్రామస్థులు కొంతo యుగంధర్ రెడ్డి, కందుకూరి శ్రీనివాస, అంబేద్కర్ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షులు మద్దెల శ్రీశైలం, యారాల ధన్వంతరి, కత్తుల వెంకటేష్, చెవులపల్లి కృష్ణ,ఉపాధ్యక్షులు దువాసి నరసింహ., ప్రధాన కార్యదర్శి మలగల విజయ్ కుమార్ , యాలాల రాఘవేందర్ , వల్లి కృష్ణ, కత్తుల రాజశేఖర్ , ఇస్తారు యాదయ్య, కత్తుల శ్రీశైలం, బాలగోని రమేష్ గౌడ్ , కత్తుల యాదయ్య, దేవోజి లక్ష్మయ్య, బ్యాగరి రాములు, కత్తుల రమేష్ , పిరికిరాల కుమార్ మరియు గ్రామస్తులతో పాటు వివిధ పార్టీల నాయకులు తెలుపడం జరిగింది...
Comments