విశ్వ శాంతి కై శ్రీ మత్ విరాట్ విశ్వకర్మ భగవాన్

 ప్రజాబలగం : న్యూస్ టు డే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో ని శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంగం ఆల్మసుగూడ వారి ఆధ్వర్యంలో విశ్వశాంతి కై శ్రీమాత్ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం (22-09-2024) ఆదివారం రోజు ఆల్మసుగూడ పరిధిలో వున్న చప్పిడి అడివి రెడ్డి గార్డెన్ లో ఘనంగా నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే టీపీసీసీ అధికార ప్రతినిధి మరియు బడంగ్పేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ని ఆహ్వాన పత్రిక ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో శ్రీమాత్ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం కమిటీ అధ్యక్షులు శ్రీ నారోజ్ కుమారస్వామి చారీ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేయర్ పారిజాత నరంహారెడ్డి మాట్లాడుతూ లోకాశాంతి కై జరుగుతున్న యజ్ఞ మహోత్సవం కాబట్టి కచ్చితంగా వస్తా అని హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Comments