బాలాపూర్ నారాయణ జూనియర్ కాలేజీ లో గణంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు!!

ప్రజాబలగం : న్యూస్ టు డే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని బాలాపూర్ నారాయణ జూనియర్ కాలేజీ లో గణతంత్ర దినోత్సవం చాలా గణంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో ఎన్ సి సి  కార్యక్రమాలతో మరియు మార్చ్ ఫాస్ట్ తో కాలేజీ యాజమాన్యానికి మరియు అధ్యాపక బృందానికి స్వాగతం చెప్పడం జరిగింది. తరువాత కాలేజీ ప్రిన్సిపాల్ మరియు డైరెక్టర్స్ జెండా ఆవిష్కరణ లో పాల్గొని విద్యార్థాలను ఉద్దేశించి స్వాతంత్ర ఉద్యమ కారుల గురించి మరియు విద్యార్థుల భవిష్యత్తు గురించి భారతీయుని గా మనం దేశానికి ఎం చేయాలి అని నేటి బాలాలే రేపటి పౌరులు అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాలేజీ ప్రిన్సిపాల్ పరమేష్ గౌడ్ గారు మరియు కాలేజీ డైరెక్టర్స్ రాఘవ చారీ గారు, పర్వతాలు గారు అదేవిధంగా అధ్యాపకాబృందం పాల్గొని విజయవంతం చేశారు.

Comments