చదువుకున్న స్కూల్ రుణం తీర్చుకున్న పూర్వ విద్యార్థి న్యాయవాది కృష్ణ గారు




తాను చదువుకున్న ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సౌండ్ సిస్టం ను బహుకరించిన పూర్వ విద్యార్థి న్యాయవాది కృష్ణ.
 ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 2005 పదవ తరగతి పూర్వ విద్యార్థి, ఇబ్రహీంపట్నం తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలకు సౌండ్ సిస్టం ని స్థానిక పాఠశాల కళాశాల ప్రధాన చార్యులు మెర్సీ వరూధిని, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ లెక్చరర్స్ శ్రీ కనకయ్య,శ్రీనివాస్, హుస్సేన్,కిషోర్,వెంకన్న ఉపాధ్యాయుల సమక్షంలో పాఠశాలకు బహుకరించడం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ నేను ఈరోజు ఒక న్యాయవాదిగా ఈ స్థాయిలో ఉండడానికి నా కు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ప్రధాన కారణమని నాకు పాఠశాల దేవాలయం లాంటిదని ఉపాధ్యాయులు ప్రత్యక్ష దైవాలు అని అన్నారు.నేను చదువుకున్న పాఠశాల రుణం ఈ రకంగా తీర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు చెప్పిన ప్రతి విషయాన్ని పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. గురుకుల పాఠశాలలో గురువులే మనకు తల్లిదండ్రులుగా ఉంటారని వారిని మన తల్లిదండ్రులుగా భావించి వారికి ఎల్లవేళలా మనం క్రమశిక్షణగా ఉంటూ వారి మార్గదర్శకత్వంలో మన జీవితాన్ని నిర్మించుకోవాలని కోరారు. కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరించి వారికి ఎదురు మాట్లాడి జీవితంలో నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని గుర్తు చేశారు. తల్లిదండ్రులు గురువుల మాటలు విని గొప్ప స్థానంలో ఉండాలని మనమందరం గురువు లను దైవాలుగా భావించాలని కోరారు. విద్యార్థులు ఆటపాటలు విద్యా విజ్ఞానం చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని మన ఉపాధ్యాయులు కోరుకుంటారని వారు చెప్పిన పద్ధతిలో మనం నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కావలి నరసింహ కృష్ణ గారి నాన్న చెన్నయ్య, సింగర్ విష్ణువర్ధన్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బరిగెల శోభారాణి, అడ్వకేట్ ఇందుమతి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Comments