గృహజ్యోతి తో ఉపాధి కోల్పోయినం!


ప్రజా బలగం : న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ ల పథకాలలో గృహజ్యోతి కూడా ఒక పథకం. గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ బిల్ కలెక్టర్లు ఉపాధి కోల్పోయి రోడ్ మీద పడినారు. ఉపాధి లేక అరకొర జీతాలతో కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా మారింది అని విద్యుత్తు బిల్ కలెక్టర్లు వాపోతున్నారు. ఈ లాంటి ఉచిత హామీల వల్ల కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయింది అని వాలా బాధ ను వెళ్లబోసుకుంటున్నారు. ఈ రోజు విద్యుత్ బిల్ కలెక్టర్లకు ERO, SE, DE, ఆఫీసులో ఉపాధి కలిపించి మా కుటుంబాలను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ల తో అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి మమల్ని గుర్తించి ఉపాధి కల్పించాలని విద్యుత్తు బిల్ కలెక్టర్లు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు బిల్ కలెక్టర్లు అందరు పాల్గొని విజయవంతం చేసిండ్రు.

Comments