ప్రజా బలగం : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ నారాయణ జూనియర్ కాలేజ్ లో విద్యార్థులు అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మా భవిష్యత్ బాగుండాలి మంచి మార్కుల తో ఇంటర్మీడియట్ పాస్ అవాలని అమ్మ వారికీ బోనం సమర్పించారు. అంతకు ముందు కాలేజ్ లో పోతురాజాల విన్యాసాలతో విద్యార్థుల ఆట పాటలతో సంతోషంగా కాలేజ్ నుండి బోనం తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ పరమేష్ గారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ మరింత ఆనందకరంగా ఉండాలని మరియు వారికీ మంచి జీవితం ప్రసాదించి జీవితం లో ఉన్నతంగా ఎదగాలని మంచి సంస్కృతి అలవాటు అవుతదని కాలేజీ నుండి అమ్మవారికి బోనం తీసుకెళ్లడం జరిగింది అని చెప్పడం జరిగింది. విద్యార్థులు కూడా కాలేజీ నుండి బోనం తీసుకెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం రాఘవచారీ గారు, పర్వతాలు గారు, పరమేష్ గారు మరియు కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments