సెప్టెంబర్ 17విశ్వకర్మ జయంతి ని విజయవంతం చేయండి శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంగం అధ్యక్షుడు నారోజు కుమారస్వామి చారి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్గూడ శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా అధ్యక్షుడు నారోజూ కుమారస్వమి చారి మాట్లాడుతూ... సెప్టెంబర్ 17న జరిగే విశ్వకర్మ జయంతి మహోత్సవంలో జరిపే యజ్ఞ  కార్యక్రమానికి సంబంధించి కమిటీ ఏర్పాటుపై చర్చించి మరియు ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని ఆహ్వానించే విషయం, సంఘం యొక్క నియమ నిబంధనలు, బలోపేతానికి సభ్యుల యొక్క పాత్ర మరియు ప్రతి అమావాస్య రోజున సంఘం ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి ప్రతి సభ్యుడు హాజరై, విశ్వకర్మలకు ఎదురయ్యే సమస్యలపై చర్చించాలని అలాగే వాటి పరిష్కారానికి సంఘం ఎల్లపుడూ కృషి చేస్తుందని, తదితర విషయాలపై సభ్యులతో కలిసి నారోజు కుమారస్వమి చారి చర్చించి తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.   

ఈ కార్యక్రమంలో ఆల్మాస్గూడ శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ కోశాధికారి బండోజు రవికుమార్ చారి, రాజేష్ చారి, బండి కట్ల వెంకటేశ్వర్ల చారి, పసునూరు మల్లేష్ చారి, గోవర్ధన్ చారి, మురళి చారి, కనకాచారి, కార్యవర్గ సభ్యులు, విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులు తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

 

Comments