మీర్ పెట్ (బాలపూర్) పరిధిలో గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్న వారి పై చర్యలు తీసుకోవాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, K, కాశీ విశ్వనాథ్ గారికి...బాల పూర్ ఏరియా PYL కమిటీ వినతి

  ప్రజాబలగం : మీర్ పేట్,బాల పూర్ పరిధిలో పిల్లలను, యువకులను వ్యసనపరులుగా మారుస్తున్న మాదక ద్రవ్యాలను నియంత్రించాలని...

 ప్రగతిశీల యువజన సంఘం, బాలాపూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలోఈరోజు మీర్ పేట  ఇన్స్ పెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 'ఇటీవల కాలంలో యువకులకు మహమ్మారి వలే పట్టి వారిని పీల్చి పిప్పిచేసేదిగా మాదక ద్రవ్యాలు తయారయ్యాయని, ప్రత్యేకించి మీర్పేట పరిధిలోనూ గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం బాధాకరమైన విషయమని, 15 ఏళ్ళ లోపు పిల్లలను మొదలుకొని యువకులను, ప్రజలను మాదక ద్రవ్యాలకు వ్యసనంగా మారి క్రమంగా వ్యసనపరులుగా మార్చివేస్తున్నదని, ఇది వారి ఆరోగ్యాన్ని తద్వారా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను గుల్లగుల్లగా మార్చివేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మీర్పేట పరిధిలోని బాలాపూర్ చౌరస్తా దగ్గర రక్త మైసమ్మ గుడి ఎదురుగా, లెనిన్ నగర్లోని నిర్మాణంలో వున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళ దగ్గర, మీర్పేట చెరువు, అల్మాస్ గూడలోని రాజీవ్ గృహకల్ప, గాంధీనగర్ బస్తీ తదితర ప్రాంతాలలో ప్రధానంగా మాదక ద్రవ్యాలు అమ్మకం, సేవనం కొనసాగుతున్నట్లు వారి దృష్టికి తీసుకెళ్ళారు.


 వీటిపట్ల ప్రత్యేక దృష్టి పెట్టగలరని మాదక ద్రవ్యాల అమ్మకం, అమ్మకం దారుల పట్ల కఠిన వైఖరి చేపట్టి ప్రజలను ముఖ్యంగా పిల్లలను, యువకులను వీటి బారి నుండి రక్షించాలని ప్రగతిశీల యువజన సంఘం గా విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఇన్స్ పెక్టర్ గారు సానుకూలంగా  స్పందిస్తూ.. అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, యువకుల్లో, ప్రజలలో వీటిపట్ల అవగాహన కార్యక్రమాలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.


 కార్యక్రమంలో pyl నగర అధ్యక్ష, కార్యదర్శులు M.రవి కుమార్, BS కృష్ణ, బాలాపూర్ ఏరియా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు K.రాకేష్, K.భీమేష్, ఉపాధ్యక్షులు N.నాగరాజు, సహాయ కార్యదర్శి K.శంకర్, నాయకులు G.మహేశ్, N.కాశీనాథ్, శేఖర్ లు పాల్గొన్నారు.




Comments