ప్రజాబలగం : మల్లారెడ్డి గతంలో 2014 టి డి పి లో జాయినవ్వడం జరిగింది. 2014 లో జరిగిన ఎలక్షన్ లో టి డి పి నుండి మల్కాజిగిరి పార్లమెంట్ కి పోటీ చేసి గెలుపొందిన ఒకేఒక్క అభ్యర్థి మల్లారెడ్డి. తరువాత జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని టి ర్ స్ పార్టీ లో జాయినవ్వడం జరిగింది, తరువాత మేడ్చల్ నుండి పోటీ చేసి ఎం ల్ ఏ గా గెలుపొంది కార్మికశాఖ కి మంత్రిగా పనిచేశాడు. అదే టైం లో భూ కబ్జాలు, అవినీతి, రౌడీజం కి పాల్పడిన మల్లారెడ్డి తాజాగా టి ర్ స్ పార్టీ ప్రభుత్వం పడిపోవడంతోటి మల్లారెడ్డి కి కేసుల భయం పట్టుకుంది దానితో నే అటు కాంగ్రెస్ పార్టీ లో జాయినవాలని గట్టిగ ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఇపుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టి డి పి ప్రభుత్వం అధికారం లో కి రావడం తో అక్కడ చంద్రబాబు NDA కూటమి లో కీలకం కావడం వల్ల అంతే కాకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు చెప్తే వింటాడు కాబట్టి ఆస్తులను కాపాడుకోవడానికి తెలంగాణ టి డి పి లో జాయిన్ అవొచ్చు అని మల్లారెడ్డి వర్గీయుల నుండి తెలుస్తుంది. అంతే కాకుండా మల్లారెడ్డి టీడీపీ పగ్గాలు కూడా తీసుకునే అవకాశం వుంది. అప్పుడు టీడీపీ లో వున్నపుడు కెసిఆర్ ని తిట్టడం, విమర్శలు చేసిండు ఇపుడు తెరాస లో వున్నపుడు చంద్రబాబు పై విమర్శలు చేసిండు మళ్ళీ ఇపుడు సొంత ఇంటికి పోతున్నట్లు తెలుస్తుంది రేపో మాపో చంద్రబాబు ని
కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం వుంది.
Comments