పట్టించుకోని ప్రభుత్వం.... మారని ప్రైవేట్ స్కూల్స్ .....అధికారులు హెచ్చరించిన వినని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం..

 

ప్రజాబలగం :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ జూన్ 12 కి అయినవి. జూన్ మాసం మొత్తం తల్లీ తండ్రులకి ఆర్థికంగా తలకి మించిన భారం అవుతుంది అని వాపోతున్నారు. ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం అధిక ఫీజులు, సపరేట్ బుక్స్ ఫీజులు మరియు డ్రెస్ లు ఫీజులు అధికంగా వసూలు చేస్తుండటంతో మధ్యతరగతి తల్లీ తండ్రులు కట్టలేకుండా నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికి కూడా ఏ ఒక్క స్కూల్ కూడా ఆదేశాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ఫీజులు తీసుకుంటుండ్రు. విద్యార్థుల తల్లీ తండ్రులు అడిగినప్పటికి తిరిగి వాలనే మీ ఇష్టం ఉంటే జాయిన్ చేయండి లేదు అంటే మీ ఇష్టం అని దురుసుగా మాట్లాడుతుండ్రు అంటూ తల్లీ తండ్రులు వాపోతున్నారు. ఈ పరిస్థితి నుండి మధ్యతరగతి కుటుంబం వాళ్లు బయటపడాలి అంటే ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ పై మరియు యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు వ్యవహారిస్తే ప్రజలే రోడ్ల మీదికి వస్తారు. అప్పుడు ప్రభుత్వం అన్ని విధాలా నష్టపోతుంది కాబట్టి ఎప్పటికైయిన కళ్ళు తెరిచి చర్యలు తీసుకుని పేద విద్యార్థలని చదువుకునేలా చేయాలనీ ప్రతి విద్యార్ధి తల్లీ తండ్రి డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మరియు బడంగ్పేట్ పరిధిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు భాహిరంగంగానే బుక్స్,స్కూల్ ఫీజులు మరియు డ్రెస్సులు అమాంతం పెంచేశారు ఇదేంటి అని తల్లితండ్రులు ప్రశ్నించగా దుర్భాషాలు ఆడుతున్నారు. ఈ ఘటన పై s star media ప్రతినిధి రంగారెడ్డి జిల్లా DEO కి ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఇలా వుంది ప్రస్తుత ప్రభుత్వ పనితీరు. ఎప్పటికైనా కఠినమైన ఆదేశాలు ఇచ్చి ప్రెవేట్ పాఠశాల లని గాడిలో పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద వుంది.

Comments