లంచాలకు అలవాటు పడ్డ మీర్పేట్ పోస్ట్ ఆఫీస్ అధికారులు
ప్రజా బలగం : బాలాపూర్ మండల్ మీర్పేట పరిది పోస్టాఫీసు లోని కొంత మంది అధికారులు లంచం ముట్టనిదే పనిచేయమంటూ ఏదేచగా చెప్పేస్తున్నారు. ఏదైనా పని చేయాలంటే ముందు పైసా తర్వాతనే పని అని అంటున్నారు. తాజాగా ఒక ఘటన వెలుగు లోకి వచ్చింది.సదరు మహిళ కు ఒక పోస్ట్ వచ్చింది.ఆ మహిళకు పోస్ట్ మన్,నీకు పోస్ట్ కావాలంటే నాకు 100 రూపాయలు ఇవ్వాలని అడగడం తో , ఆ మహిళ డబ్బులు ఎందుకు ఇయ్యాలి అని ప్రశ్నించింది.
నీ పోస్టు మా ఆఫీసు దగ్గరకు వచ్చి తీస్కొని పో అంటూ మర్యాద హీనంగా పోస్ట్ మాన్ చెప్పడంతో ఆ మహిళ పోస్ట్ ఆపీసు దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదును కనీసం వినకుండా అక్కడి అధికారులు రూల్స్ ప్రకారం మీ ఇంటి వద్దకు వస్తేనే తీసుకోవాలి లేదంటే మేము ఇయ్యము అంతే కాకుండా మా పోస్ట్ మాన్ కి డబ్బులు ఇచ్చి తీసుకోండి అంటూ చెప్పారు.అక్కడే ఉన్న ఒక ముసలావిడ కూడా నన్ను కూడా ఒక అకౌంట్ తీయాలంటే డబ్బులు ఇస్తేనే తీస్తము లేదంటూ లేదు అంటున్నారని వాపోయింది. ఈ విషయం పై సదరు మహిళా ఆన్లైన్ లో ఆ అధికారుల పై పిర్యాదు చేస్తానని చెప్పగా నీకు ఇష్టం వచ్చిన దగ్గర కంప్లైంట్ చేస్కో అని అక్కడి అధికారులు ఆమెను బెదిరించారు. ఆఖరికి పోస్ట్ ఆఫీస్ లు కూడా లంచాలకు అడ్డాగా మారిపోయాయి. ఇలాంటి అధికారుల పై చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
Comments