మొదలైన సలేశ్వరం లింగమయ్య జాతర


ప్రజా బలగం : ఏడాదికి ఒక్కసారి కేవలం మూడు రోజులు మాత్రమే జరిగే నల్లమల్ల అడవులలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్య జాతరకు సర్వం సిద్ధమయింది. ఈ లింగయ్య నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంల కొలువుదీరి ఉన్నాడు. ఈ లింగమయ్య జాతరకు ప్రతి ఏడాది లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఈ జాతర ఉగాది పండుగ జరిగిన తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమికి ఒకరోజు ముందు ఒకరోజు వెనకాల అంటే మొత్తం మూడు రోజులు జరుగుతది. ఏప్రిల్ 22, 23 ,24 తారీకులలో గీ జాతర నల్లమల్ల అడవులలో జరగనున్నది. గి జాతరకు కావలసిన ఏర్పాట్లన్నీ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధం చేసాయి. ఈసారి సలేశ్వరం జాతరకు పోయిన యాడాది కంటే ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. 5 లక్షల నుండి 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎండాకాలం కాబట్టి ఎండలో మండుతుండడంతో భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు చెప్తున్నారు. ఇక ఈ జాతరంతా అడవి మార్గంలోనే జరగడంతో వచ్చిన భక్తులంతా ఎక్కడ కూడా ప్లాస్టిక్ గాని, నిప్పు కానీ మరియు ఎటువంటి హానికరమైన మత్తు పదార్థాలు గాని, ఏవైనా చేసిన కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు. లింగమయ్య జాతర యాడాదిలో మూడు రోజులే జరగడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అందుకు భక్తులు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారని, ఈ లింగమయ్య దర్శనం 9 నెలలు జరిగేటట్టుగా చర్యలు వీలైనంత త్వరలో తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ చెప్పారు. భక్తులంతా అడవి మార్గంలో వచ్చి పోయేటప్పుడు ఎటువంటి హానికరకమైనటువంటి పనులు చేయకుండా క్షేమంగా వెళ్లి ఆ సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవాలని కోరుకుంటున్నామని అక్కడి అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ అధికారులు అన్నారు.

Comments