మానవ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పుణ్యస్థలం "సలేశ్వరం"...?

 

 ప్రజాబలగం : సలేశ్వరం ఒక మహా పుణ్యస్థలం.దేవను దేవున్లు సైతం ఆ లింగమయ్యను పూజించిన గొప్ప స్థలం.ఎందరో మహాగ్నానులు,యోధులు,తపస్సు చేసిన మహా గొప్ప ప్రదేశం మన తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలోని ,అంబ్రాబాద్ మండలం లో దట్టమైన నల్లమల అడవుల్లో,ఎత్తైన కొండలల్ల, లోతైన లోయల్ల నడుమ స్వయంభు గా వెలసిన పరమేషుడి దైవ స్థలం.అదివాసులు మహా దైవంగా కొలిచే పరమశివుడు నె ఇక్కడ లింగమ్మయ్య గా వాళ్లు పిలుచుకుంటూ పూజలు చేస్తారు. ఇక్కడ పూజరులు చెంచులే.

లింగమయ్య జాతర ఎప్పుడంటే ?

దట్టమైన నల్లమల్ల అడవులలో ఈ సలేశ్వరం లింగమయ్య జాతర ఏడాదికి ఒక్కసారి అది కూడా మూడే రోజులు లింగమయ్యను దర్శించుకోనీకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తయి. అందుకే ఈ మూడు రోజులే లింగమయ్య దర్శనానికి వీలైతది. ఈ లింగమయ్య జాతర చైత్ర పౌర్ణమికి ఒక్కరోజు ముందు ఒకరోజు వెనకాల మొత్తం మూడు రోజులు జరుగుతది. ప్రతి ఏడాది ఈ జాతర ఎండుకాలంలోనే ఉంటది.ఈ లింగమయ్యను దర్శించుకోవాలంటే ఎవ్వరైనా సరే సాహసోపేతమైన యాత్ర చేయవలసింది. ఈ లోయలోకి దిగే భక్తులంతా ..వతన్నం వతాన్నం లింగయ్య అని మల్ల తిరిగి పోయేటాలు పోతున్నాం పోతున్నాం లింగయ్య ,మళ్ళీ ఏడాది మల్లోస్తం అని చెప్పుకుంట పోతరు. దేశంలోనే ఇటువంటి సాహసోపేత యాత్రలు 2 1. అమర్నాథ్ యాత్ర, మరొకటి సలేశ్వరం లింగమయ్య. అందుకే ఈ యాత్రను తెలంగాణ అమర్నాథ్ యాత్రగ పిలుస్తారు.

సలేశ్వరం లింగమయ్యను దర్శించుకోవడం ఎట్లా? 

ఈ లింగమయ్య జాతర నాగర్ కర్నూల్ జిల్లాలో అంబ్రబాద్ మండలంలో ఉన్న దట్టమైన నల్లమల్ల అడవులలో ఉన్నది. హైదరాబాదు నుంచి శ్రీశైలం పొయ్యే దారిల 150 కీ. మీటరు రాయి నుంచి 32 కీ.మీటర్ల దురంల ఉన్నది. గే అడవి మార్గంలోనే ఒక పది కిలోమీటర్లు పోంగనే అక్కడ నిజాం కాలం నాటిది ఒక పురాతనమైన భవనం కనిపిస్తది. నిజాo విడిది నుండి ఎడమ దిక్కున పోతే 22 కిలోమీటర్ల దూరంలో సలేశ్వరం బేస్ క్యాంపు వస్తది. ఆడికెళ్లి సలేశ్వరం జలపాతం బోనికే రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. గీడ రెండు పొడవు ఎత్తుగా ఉన్న రెండు గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నవి కనబడతాయి. ఈటి నడుమ  ఒక లోతైన లోయలకి ఆ జలధార పడుతుంటది. తూర్పు గుట్టకు అర కిలోమీటర్ల దిగి తర్వాత దక్షిణం వైపు తిరిగి పశ్చిమ వైపు ఉన్న గుట్టమీదికి రెండు కిలోమీటర్ల దూరం నడవాలి. ఆ గుట్ట కొనకు చేరుకున్నాక మల్ల ఉత్తర దిక్కుకు తిరిగి గుట్టల మధ్య లోయలకి దిగాలి. ఈ దారంట పోతుంటే గుహలు ,సన్నని జలదారులు మస్తుగ కనిపిస్తాయి. ఇంకా కొంచెం దూరంల గుండం ముందనంగానే గా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండంల నుండి పారే నీటి ప్రవాహం వెంబడే రెండు గుట్టల నడుమ ఒక ఇరుకైన లోయల జాగ్రత్తగా నడవాలి. ఇంకొక చోట్ల అయితే ఇక బెత్తెడు దారిలో నడవాలి. చానా జాగ్రత్తగా చూసి నడవాలి ఏమరు పాటగా ఉంటే మటుకు కాలు జారితే కైలాసానికే. గుండం దాకా చేరుకున్న తర్వాత అక్కడున్న గా దృశ్యాలను చూస్తే షా నా అందంగా కనిపిస్తాయి. ఒక్కసారి తలకాయ పైకెత్తి చూస్తే ఇక ఆకాశం వైపు ఉన్న చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అడవి, గా మధ్యలో నుండి ఆకాశం మన నెత్తి మీద ఉన్నట్టే అవుపడుతది. గీ గుండంలో నీళ్లు చాన సల్లగా, చానా తేటగా ఉంటాయి. గీ గుండం నీళ్లల్లా చాలా వనమూలికలు కలిసినవని గా నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఇక్కడి చెంచులు చెప్తుంటారు. గుండం ఒడ్డు మీద తూర్పు ముఖంగా ఇంకో రెండు గుహలు ఒకదానిమీద ఒకటి ఉంటాయి. పైన గుహనే ముందు చేరుకొని గా గుహలనే ఉన్న ప్రధాన దైవము పవిత్ర మైన లింగమయ్య స్వామిని దర్శించుకోవాలి. కింద గుహలో కూడా లింగమే ఉంటది. గుడి ముంగల మాత్రం వీరభద్రుడు గంగమ్మ తల్లి విగ్రహాలు ఉంటాయి. పైన చెప్పిన విధంగా ఈ దారంతా కాలినడకలనే పోవాల్సి ఉంటుంది. గిసువంటి చానా అద్భుతాలు సలేశ్వరం లింగమయ్య యాత్రలనే చూడవచ్చు.

స్థల పురాణం : చరిత్ర మరియు ప్రచినం నుండి ఈ ఆలయాన్ని బ్రహ్మ దేవుడు స్వయంగా నిర్మించడాని చెప్తుండగా, శ్రీశైలం మల్లికార్జున స్వామి లాంటి ప్రతిరూపాలు 5 లింగాలు 1. ఉమామహేశ్వర లింగం,2. లొద్ది మలయ్య 3.సళేశ్వరం లింగమయ్యా ,4. శ్రీశైలం మల్లికార్జున స్వామి గా,అయిదవ లింగం మాత్రం ఆ నల్లమల అడవుల్లలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగ మిగిలిపోయింది. ఈ అయిదవ లింగం ఎక్కడుందో నారా మానవులకి సైతం తెలుసుకోలేకపోయారు అనేది ఒక చరిత్ర. ఎందరో దేవాను దేవతలు, యోగులు, జ్ఞానులు, రాజులు ఇక్కడకు వచ్చినట్టు,ఛత్రపతి శివాజి సైతం ఈ ఆలయానికి వచ్చి లింగమయ్యాను దర్శించుకునట్టు చరిత్ర, మరియు స్థల పురాణము చెప్తున్నది. బౌద్ధ భిక్షువులు సైతం ఈ సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుని అక్కడ నివసించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గుడికి ఎడమ వైపు హారతి గోడకి బ్రంహి లిపి లా ఒక శాసనం చెక్కబడి ఉన్నది. కుడి వైపున గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడా ఉన్నది. గీ రెండు విష్ణు కుండీనుల శాసనాలుగా తోస్తున్నాయి. గీ రెండు విష్ణు కుండీలు శాసనాలను  చరిత్రకారులు చదివి వివరిస్తే విక్షకుండీను  జన్మస్థానాన్ని కచ్చితంగా నిర్ణయించవచ్చు.మల్లికార్జున పాండిత్ ఆరాధ్య చరిత్రలో కూడా శ్రీ పర్వత క్షేత్ర మహత్యంలో గీ సలేశ్వరం విశేషాలను పాల్కురి  సోమనాథుడు విశేషంగా వర్ణించిండు. ఇటువంటి వివిధ రకాల చరిత్రలు ,పురాణాలు,గ్రంథాలు సైతం సెలేశ్వరం లొంగమయ్య గురించి ప్రత్యేకంగా గావించపడ్డాయి.

లింగయ్య ప్రత్యేకతలు : 

ప్రపంచంలో గంగమ్మ తల్లి శివుడికి కుడి దిక్కునో లేదంటే ఎడమ దిక్కునో ప్రవహిస్తుంటుంది. కానీ ఈ సలేశ్వరం లింగమయ్య దగ్గర మాత్రం లోతైన లోయల లింగమయ్యకు ఎదురుగా ఎంతో ఎత్తైన గుట్టల మధ్యల నుండి ఒక జలధార లాగా గంగమ్మ తల్లి నిత్యం స్వామి కి అభిషేకం చేస్తునట్టు కనిపించే గి దృశ్యాన్ని చూడటం ఎంతో  అద్భుతంగా ఉంటుంది. ముందుగాల ఎత్తైన నాలుగు చేతులు గల వీరభద్ర స్వామి, తర్వాత కిరీటం లేని వినాయకుడు అవుపిస్తాడు. తర్వాత రెండు దిక్కులా గంగమ్మ తల్లి విగ్రహాలు కనిపిస్తాయి. ఒక చీకటి గృహలో బండపై చిన్న లింగాకారంలో సలేశ్వరం లింగమయ్య కొలువుదీరి ఉన్నాడు. ఒక దీపం వెలుగులోనే వెయ్యి దీపాల వెలుగు లాగా లింగమయ్య తన భక్తులకు దర్శనం ఇస్తాడు. ఈడ ఇంకొక ప్రత్యేకత ఏందంటే ప్రతి ఏడాది చైత్ర పౌర్ణమి రోజు ఆ చంద్రుని కిరణాలు సూటిగా ఆ లింగం మీద పడడం ఒక అద్భుతమైన దృశ్యం. ప్రకృతిని చూస్తే ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. కోరిన కోరికలు తీర్చి అడిగినవన్నీ ఇస్తాడని ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న లింగమయ్యను స్పర్శ దర్శనం చేసుకున్నవాళ్లకు కోటి జన్మల పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.

సలేశ్వరం లింగమయ్య జాతర ఈ  ఏడాదిలో : 

ఏప్రిల్ నెల ఉగాది తర్వాత వచ్చే చైత్ర పౌర్ణమి అంటే 22, 23, 24 తారికులల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జాతరకు అనుమతిని ఇచ్చినయి. ఈ జాతరంతా వన్యప్రాణులు మూగజీవాలు నిత్యం తిరిగే చోట జరుగుతది కాబట్టి ఇక్కడ జరిగే ఈ మూడు రోజుల జాతరలో ఎటువంటి రకమైన ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదని ఒకవేళ వాడాల్సి వస్తే వాటిని అడవిలో వెయ్యకూడదని  పర్యావరణ శాఖ, అడవి శాఖ,మరియు మా S STAR MEDIA ఛానల్ తరఫునుంచి కోరుకుంటున్నాము. పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మన అందరి మీద ఉంటుంది. పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఎటువంటి హానికరమైనటువంటి పనులు చేయకూడదని, భక్తులంతా క్షేమంగా వెళ్లి ఆ సలేశ్వరం లింగమయ్యను భక్తిశ్రద్ధలతో దర్శించుకొవలని  మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

Comments