ప్రజా బలగం: ఇక దేశమంతా ఎన్నికల కోడ్ అమలనే ఉండంగా ఈరోజు తెల్లవారుజామున ములుగు జిల్లాలోని అడవుల్లో జరిగిన దాడుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిర్రు. మొన్నటికి మొన్న రెండు రోజుల క్రింద చత్తీస్గఢ్ ప్రాంతంలో 13 మంది మావోయిస్టుల ప్రాణాలు కోల్పోయారు బీజాపూర్ జిల్లాలోని కార్బోలి అడవుల్లో ప్లీనర్లు నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఇక గిది తెలుసుకున్న ఉన్నతాధికారులు పోలీసులకు వారి ఆదేశాల మేరకు జిల్లా సిఆర్పిఎఫ్, కోబ్రా, రిజర్వ్ గార్డ్స్, బస్టర్ ఫైటర్స్, ఛత్తీస్గడ్ ఫోర్స్, భద్రతా బలగాలు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవులను అన్నింటిని చుట్టుముట్టారు. ఇగ తెలంగాణ అడవులలో ఛత్తీస్గడ్ సరిహద్దులలో ఎన్కౌంటర్లు అయితే జరిగినయి. మావోయిస్టుల కదలికలతో భద్రత బలగాలు షాన అప్రమత్తమయి అడవిని మొత్తం జలడబట్టిండ్రు గిది గిట్లుండగా మూలుగు జిల్లా వెంకటాపురం దగ్గర కర్రెగుట్టల వద్ద మావోయిస్టుల భద్రతా బలగాలు అయితే కాల్పులు జరిపినయ్ ఇక పోలీసుల పైన మావోయిస్టులు మావోయిస్టుల పైన పోలీసులు ఇరువురు కాల్పులు అయితే జరుపుకున్నారు. ఇక ఘటన జరిగిన స్థలంలో మూడు తుపాకులు పేలుడు పదార్థాలు అయితే బాగానే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అయితే జరిగింది కానీ ఇంక దీని వివరాలు అయితే పూర్తిగా తెలియాల్సి ఉంది.
Comments