ప్రజాబలగం : తెలంగాణల లోక్సభ ఎన్నికల ప్రచారం మస్తు జోరుగా సాగుతుందని అందరికీ తెలిసిన ముచ్చటనే. అయితే ఇయ్యాల భువనగిరి ఎన్నికల ప్రచారంల సీఎం రేవంత్ రెడ్డి ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని ఉద్దేశించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పిండ్రు. ఆయనతోపాటు కోమటిరెడ్డి కూడా సీఎం పదవికి అర్హుడు అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అన్ని దొంగ దీక్షలు చేసిండని రాష్ట్రాన్నే సర్వనాశనం చేసిండని మండిపడ్డారు. కానీ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి నిజమైన పోరాటం చేసిండు. ఇక కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి తెలంగాణను బొందల గడ్డ లెక్క మార్చిన్రని మస్తు కోపం అయిండు. భువనగిరి అభివృద్ధి చెందాలంటే గది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని బిఆర్ఎస్, బిజెపి పార్టీలను బొంద పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేండ్ల మోడీ పాలనల కెసిఆర్ కూడా కుమ్మక్కయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చనీకే కేసీఆర్ కుట్రలు చేస్తుండని మండిపడ్డాడు. బిజెపి మోడీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినవని అన్నారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే కాంగ్రెస్ జోలికి ఎవ్వడొచ్చినా వాళ్ళని ఆడనే పండబెట్టి తొక్కుతాం , కాంగ్రెస్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఒకొకన్ని లాగులు ఉడిందక తంతం అని చానా ఘాటుగ వ్యాఖ్యలు చేసిండు.
Comments