ప్రజాబలగం : రైతన్నలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.గా మధ్య పడ్డ వడగళ్ళు, అకాల వర్షాల తో దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందజేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గీ అకాల వర్షాలతో రాష్ట్రాల చానా చోట్ల పంట నష్టం వాటిల్లింది.చేతికి వచ్చిన పంట నెలకొరగడం తో రైతులు చానా బాధపడ్డారు.మామిడి, నిమ్మ, బత్తాయి వంటి పంటలు కూడా చానా దెబ్బతిన్నాయి. వరి దాన్యలైతే ఈ వనలతోని పంట పొలంలనే వచ్చుడుతోని అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రతి పక్ష నేత బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ క్షేత్ర స్థాయిల పంటలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిండు.మంత్రులు కూడా పంటలను పరిశీలించి రైతులకు పంట నష్టం పరిహారం ఇస్తామని హామీ ఇచ్చి చానా ధైర్యం చెప్పారు.15246 మంది రైతులకు చెందిన 15814 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అంచనాకు వచ్చింది. ఇగ ఎకరానికి 10 వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది.ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండుట్ల ఎన్నికల సంఘం అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లోకి పరిహారం పైకం జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. రైతురుణ మాఫీ, వరికి రూ.500 బోనస్ ఇచ్చే అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న కిలకమైన ప్రకటన చేసిండు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని...ఆగస్టు 15 తేది లోగా రైతన్నలకు ఏకకాలంలో రూ.200000 రుణమాఫీ చేస్తామని చెప్పారు.గట్లానే వచ్చే సీజన్ నుంచి వరి కి ప్రకటించిన రూ.500 బోనస్ కూడా ఇస్తామని అన్నారు.
Comments