ప్రజాబలగం : తెలంగాణల కొత్తగా పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిండ్రు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్న తెలంగాణ పోలీసులు కొత్తగా డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల గురించి అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటినుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కి బదులు డ్రగ్స్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తారట. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో ఈ పరీక్షల కోసం ప్రత్యేకంగా కిట్టునే రూపొందించింది. డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు ఈ చర్యలైతే చేపట్టింది ప్రభుత్వం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతోనే డ్రగ్స్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని గీ నేపథ్యంలోనే డ్రగ్స్, గంజాయి తీసుకున్నోళ్ళని అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించాలని ఒక ప్రత్యేక కిట్టును అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు. డ్రగ్స్ వినియోగిస్తున్న వాళ్ళని ప్రదానంగా గంజాయి తాగేటోల్లని గుర్తించడం కోసం ఎబోస్ యూరిన్ కప్ అనే ఈ యంత్రంతో అప్పటికప్పుడు టెస్టులు నిర్వహిస్తారట. ఈ ప్రత్యేక కిట్టును ఇప్పటికే రాష్ట్రంల అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిండ్రు. సదరు పరికర సాయం తోటి డ్రగ్స్ వినియోగించేటోళ్ళని గుర్తించే విధానం పై సిబ్బందికి ట్రైనింగులు కూడా ఇచ్చిండ్రు. రాష్ట్రంల ఇప్పటికే కొన్ని పోలీస్స్టేషన్ల టెస్ట్లు మొదలుపెట్టిండ్రు. డోర్నకల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసరాలలో అనుమానంగా తిరుగుతున్న యువకులను స్థానిక పోలీసులు వారికి పరిక్షలు నిర్వహించిండ్రు. గంజాయి కాకుండా ఇతర మాదకద్రవ్యాలు కూడా వినియోగించినారనే అనుమానం వచ్చిన పక్షంలో గీకిట్టు ద్వారా మూత్ర పరీక్షలు నిర్వహిస్తారట. ఈ పరీక్ష నిర్వహించినప్పుడు రెండు ఎర్ర గీతాలు కనిపిస్తే నెగిటివ్గా ఒక్కటే గీత కనిపిస్తే పాజిటివ్గా పరిగణంలోకి తీసుకుంటారట. పాజిటివ్ అని తేలితే సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంటరిగా. అవసరమైతే తదుపరి పరీక్షలు నిర్వహిస్తారు ప్రధానంగా బస్టాండ్లు రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్లనే టార్గెట్ చేయనున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇగ విశాఖలో లక్ష కోట్ల డ్రగ్స్ వ్యాపారం ఉన్నోళ్ళని ఉరితీయాలని మాజీ మంత్రి అన్నారు.
Comments