చింత చిగురు ఖరీదు ఇప్పుడు ఎంతో తెలుసా ?

ప్రజాబలగం : జనాలకు ఆకుకూరల రేట్లు ఎట్లుంటయో అందరికీ తెలిసిందే. మార్కెట్లల్ల తోటకూర ,పుంటి కూర, పాలకూర, గిట్ల ఏది తీసుకున్నా ₹10 లకు రెండో లేకపోతే మూడో కట్టలు ఇస్తుంటారు. ఇక మహా అయితే పది రూపాయలకు ఒక్క కట్టనైనా ఇస్తారు. ఇంతకంటే ఎక్కువ ధర అయితే ఎప్పుడూ ఉండనే ఉండదు. కానీ ఇప్పుడు గీ చింతచిగురు ధర తెలిస్తే మాత్రం నోరు ఎల్లపెట్టాల్సిందే. అవును మరి పల్లెల్లో అంతగా పట్టించుకోని చింతచిగురును ఇప్పుడు సిటీల మాత్రం మస్తు ఖరీదైన కూరలల్ల ఒకటిగా మారింది. కీల మటను రెండు, కిలోల చికెను ,మూడు కిలల చా, సమానంగా ఈ చింతచిగురు రేటు మార్కెట్లో ఒక్క కేజీకి 700 ఉన్నది. హైదరాబాదు గుడిమల్కాపూర్   మార్కెట్ల హోల్ సేల్ ఇంక రీటైల్  తో పాటు రైతు బజార్లలో రైతులు రెండు, మూడు రోజుల నుంచి గీ చింతచిగురు నైతే విక్రయిస్తున్నారు. చింత చెట్ల ఆకులు రాలినంక వచ్చిన చింత చిగురును వంటలలో మస్తుగా ఉపయోగిస్తారు. గీ చింతచిగురు తోటి చేసినా పప్పు ,నీసు వంటకాలు భోజనప్రియులు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే గీ మార్కెట్లలో ఒక్క కిలో చింతచిగురు 500 నుంచి 600 అయితే ఉన్నది. ఇగ మెహదీపట్నం రైతు బజార్లను అయితే కిల చింతచిగురు 700 పలికింది. ఇక బహిరంగంగా చిన్న చిన్న మార్కెట్లలో 100 గ్రాముల చింతచిగురు 100 రూపాయలకు అమ్ముతున్నారు. చింత చెట్టు కొమ్మ చివరి వరకు ఎక్కి పానాలకు తెగించి గీ చింత చిగురును తెంపుకొస్తామని రైతులు చెప్తున్నారు. గీ చింతచిగురు చాలా తక్కువ దొరుకుతుందట అందుకనే దీనికి అంత ధర అని అంటున్నారు. గీ చింతచిగురులా ఆరోగ్యానికి మేలు చేసేటివి ఎన్నో పోషకాలు ఉన్నాయట ఉత్తిపోషకాలే కాదు ఔషధ గుణాలు కూడా చానా ఉంటాయని న్యూట్రిషన్లు కూడా చెప్తున్నారు. చింతచిగురులా ఎక్కువ ప్రోటీన్లు తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయ్ అంటున్నారు. 100 గ్రాముల చిగుర్ల 5.8 గ్రాముల ప్రోటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థాలు, 100 మిల్లి గ్రాముల క్యాల్షియం, 1040 మిల్లీగ్రామ్ ల ఫాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, విటమిన్ c త్రీ మిల్లీగ్రాములు ఉంటాయని నిపుణులు అయితే చెప్తున్నారు. యాంటీ బ్యాక్టీరియా ల వల్ల కలిగించే ఇన్ఫెక్షన్లను గీ సింత చిగురు తగ్గిస్తాదట. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వల్ల గిట్ల మధుమేహం ఉన్నవారికి ఈ చింత చిగురైతే చాన మేలు చేస్తదట. లివర్ను రక్షించటం తో పాటు జీర్ణ క్రియను రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాదట. మరి గిన్ని సుగుణాలు ఉన్న చింత చిగురును ఈ సీజన్లో కూరలలో వండి తినడం చాలా మంచిదని చెప్తున్నారు. అందుకే గీ చింతచిగురు కిలో మటన్ తోని సరిగ్గా పోటీ పడుతున్నది.

Comments