ఎండాకాలం వచ్చిందంటే గీ ఎండల గురించే కాకుండా మనం తినే తిండి గురించి కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల తిండి పదార్థాలు కూడా ఎండ ప్రభావాన్ని శాననే పెంచుతాయట. దోసకాయలు, పుచ్చకాయలు మాత్రమే మేలు చేస్తే మరికొన్ని మాత్రం వేడిని పెంచుతయట. అందుకే గిట్ల వేడిని పెంచే వాటికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. ఎండాకాలంలో ముఖ్యంగా ఈ ఆరు రకాల తిండి తినకుండా ఉంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చికెను, చేపలు, మటన్ వంటి మాంసాహారాలు ఏదైనా ఎక్కువ చెమట పట్టేందుకు కారణం అయితయట. అందుకే గిసువంటి మాంసాహారాలు ఎంత వీలైతే అంత తక్కువ తింటే మంచిది. కానీ ఏం చేస్తo మనకేమో ముక్క లేనిదే ముద్ద కూడా దిగదాయే. అందులోనూ చికెను ,మటన్ అయితే కారము, మసాలాలు ఎక్కువ లేకపోతే అస్సలు తినబుద్దే కాకపోయే. సాయంత్రం పూట ఆయిల్ ఫుడ్లు, ఫ్రై చేసినవి కూడా అసలు తినకూడదట. వేడి కలిగించి డి ఐడ్రేషన్ గానీకే కారణమైతయి. ఇక స్నాక్స్ అయితే గడికింత గడికింత తింటనే ఉంటo. గా స్నాక్స్ కూడా ఉప్పు, నూనె ఎక్కువ ఉండే ప్యాకేజీ వైతే అసలే తినకూడదు. గీ అన్నిటికంటే పండ్లు కూరగాయల ముక్కలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తదట. ఇక వివిధ రకాల సాస్ల తోటి చేసిన పదార్థాలు తింటే గా తిండి వలన తిన్నది అరగకపోవడం గ్యాస్ ట్రబుల్ వంటివి ఈ ఎండాకాలంలోనే షాన ఎక్కువ వస్తాయంట. ఇక మందుబాబులయితే ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు అయితే అంటున్నారు. ఇక ఈ ఆల్కహాల్ వల్ల బాడీ డీహైడ్రేట్ అయి, కోక్ లు, కెఫెన్, డ్రింక్స్ బదులు చక్కెర కలుపని సహజమైన పండ్ల రాసాలే తాగితే అవి వేసవిల అవసరమైన పోషణాలన్నీ అందించి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. చెప్పిన జాగ్రత్తలు చదివిన జాగ్రత్తలు వినకుండా వేసవిల అనవసరంగా అనారోగ్యాన్ని కొనితెచ్చు కోకూడదంటే ఈ నియమాలన్నీ కచ్చితంగా పాటించాల్సిందేనట. మరి ఇంకేంటి ఎండలతోనే కాదు ఉల్ల తినే తిండితోటి కూడా శాన జాగ్రత్తగా ఉండాలి.
Comments