ప్రజాబలగం : హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో అయోధ్య నగర్ లో ఓ గదిలో రెంటుకుంటున్నారు నలుగురు స్నేహితులు. వారు బీహార్ కు చెందిన వినయ్ సింగ్, సోను తివారి, యుపి కి చెందిన సందీప్ కుమార్, రాజస్థాన్ కు చెందిన హంసరామ్. ఈ నలుగురు స్థానికంగా ఉన్న ఒక గ్రానైట్ వ్యాపారి వద్ద పనిచేస్తున్నారు.హంసరాజ్ భార్యా పిల్లలతో కలిసి కుత్బుల్లాపూర్లా అద్దె ఇంట్లో ఉండేటోడు. రోజు మద్యం తాగి భార్యను వేధించేవాడు. దీంతో అతని భార్య ఆ వేధింపులు తట్టుకోలేక రెండు నెలల కింద పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక హన్స్ రాజ్ కుత్బుల్లాపూర్ లోని ఆ గదిని ఖాళీ చేసి వినయ్ సింగ్ గదికి మకామ్ మార్చిండు. ఇక రాత్రి సందీప్ కుమార్, సోను తివారిలలు మద్యం తాగి గదిలోకి వచ్చి అన్నం ఎందుకు ఉండలేదని వినయ్ సింగ్ ను కొట్టడంతో అతడు బయటికి వెళ్లిపోయిండు. తర్వాత హంచరాజ్ ను ఇద్దరు కలిసి విచక్షణ రైతంగా కొట్టిండ్రు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు హంచరాజ్ ను కొట్టడం తో అక్కడికక్కడే స్పాట్లనే ప్రాణాలు కోల్పోయిండు. ఇది తెలుసుకున్న ఇద్దరు స్నేహితులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇక వినయ్ సింగ్ ఈ జరిగిన విషయాన్ని అతను పని చేసే గ్రానైట్ వ్యాపారికి చెప్పి ఆయన సహాయంతోటి పోలీసులకు సమాచారం ఇచ్చిండు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికులకు అందరికీ ఒక చర్చనీయాంశంగా మారింది. అన్నం వండకపోతే మాత్రం ఇంత ఘోరంగా కొట్టి చంపుతారా? మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంట్రా అంటూ స్థానికులంతా చర్చించుకుంటున్నారు.
Comments