ప్రజాబలగం : లంచం తీసుకొవడం నేరం. లంచం తీసుకోవడం నేరమని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు తెలుసు అయినా కూడా దొరికినోడు దొంగ దొరకనోడు రాజు అన్నట్టు ఏడ పడితే ఆడ దొరికినంత దోసుకుంటున్నారు. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో సిరిచెల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య అనే రైతు ప్రభుత్వం తత్కాల్ స్కీం ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా చేస్తదని తెలుసుకొని ఇంక కొంతమంది రైతులతో కలిసి 2010 అక్టోబర్ 12న అప్లికేషన్ పెట్టుకున్నారు. గది స్థానిక అధికారుల నుంచి ఆదిలాబాద్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు రేగుంట స్వామికి చేరింది. దాంతోనే ఆయనను కలిసేందుకు వీళ్లంతా కలిసి పోయినరు. ఇగ విద్యుత్ కనెక్షన్ కావాలంటే 30000 లంచం ఇయాలని స్వామి డిమాండ్ చేసిండు. అంత మొత్తం ఇచ్చుకోలేము 15000 అయితే ఇస్తామని ఈ రైతులు తెలిపిండ్రు. ఇక రైతులు 2010 నవంబరు 18న ఏసీబీ అధికారులకు ఈ స్వామి సారు లంచం డిమాండ్ చేస్తున్నాడని సమాచారం ఇచ్చిండ్రు. ఇగ సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రైతుల నుంచి స్వామి 15000 తీసుకుంటుండఅంగనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసిండ్రు. ఇక ఈ కేసు కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సాక్షాదారాలను పరిశీలించి స్వామికి నాలుగేళ్ల జైలు శిక్ష 30000 జరిమానా విధిస్తూ కోర్ట్ తీరుపైతే చెప్పింది. కోర్టు గీ తీర్పు చెప్పగానే రైతులు అంతా మస్తుగా కుష్ అయ్యిండ్రు. ఇగ గిట్ల చేతుల పైసలు వడనిదే ఫైలు కదలనివ్వడం లేదు చాలా మంది అధికారులు ఇక సామాన్యులు అడిగినంత ఇచ్చుకోలేక పనుల కదలిక లేక మస్తుగా ఇబ్బందులు అయితే పడుతున్నారు. వేధింపులు భరించలేని కొందరు గిట్ల ఏసిబి ని ఆశ్రయిస్తున్నారు.

Comments