ప్రజాబలగం : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లిలో యువకుడు వంశీని ఉంచినమన్నారు ప్రజలు అభ్యర్థులను చూసి ఓటు వేయండి అని నేతకాని సంక్షేమం కోసం కచ్చితంగా కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. కానీ ప్రభుత్వ పనులకు ఎలక్షన్లో కోడ్ వల్ల ఆటంకం కలిగిందని ఆయన అన్నారు. గత 2018 ఎన్నికలు జరిగినప్పుడు బి ఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత వారి పాలన మొదలుపెట్టిండ్రు కానీ మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మా ఆరు గ్యారెంటీలోని పథకాలను ప్రారంభించి పాలనను మొదలుపెట్టాము. బిఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు పార్టీ పెద్దలు రైతులను లూటీ చేసి,నీటి లభ్యత విషయంలో అక్టోబర్ మాసంలో తక్కువగా ఉంటాయని వాళ్ల పత్రికల వాళ్లే రాసుకున్నారు ఇప్పుడేమో కరువు కాంగ్రెస్ వల్ల అని చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే కరువు తెచ్చింది అంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఏడు లక్షల కోట్ల అప్పు భారం మోపిండ్రు ప్రజల మీద అని మంత్రి తెలిపారు. అప్పుడు రైతులను లూటీ చేసి ఇప్పుడేమో రైతుల కోసం ధర్నాలు చేస్తున్నారని రైతుల గురించి అసలు మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు ఆయన. కాలేశ్వరం ప్రాజెక్టులో కొన్ని వేల కోట్లు కొల్లగొట్టి వాళ్లు కట్టి కుంగిపోతే ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయడం లేదని మాపై ఆరోపణలు చేస్తున్నారు. కాలేశ్వరం నుంచి నీళ్లు వదిలిపెట్టి మేమే వదిలిపెట్టామని మాపై అబద్ధాలు చెబుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మేము దారిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు ఇస్తున్నామని అవి బిఆర్ఎస్ పార్టీ వాళ్లు కూడా పొందుతున్నారని రాష్ట్రంల ఇవన్నీ ఇస్తున్నామంటే ఓటు మాకే వేయాలని ఆయన అన్నారు. కెసిఆర్ ఆర్థిక వ్యవస్థను మొత్తం ఆగం చేశారని ఆయన మీద దుయ్యబట్టారు. ఇక పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాక ఐదేళ్ల పాలన గడిచిన తర్వాత ఇవ్వకపోతే అడగండి అని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బిఆర్ఎస్కు రాష్ట్రంల ఒక్క సీటు కూడా రాదు గెలవదు. కాబట్టి అది ముందే గ్రహించి అనవసరమైన ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నారని ఆయన తెలిపారు.
Comments