ప్రజాబలగం : రోజురోజుకు మండుతున్న ఎండలకు భానుడు కురిపిస్తున్న వేడికి తాగనీకే జనాలకు నీళ్లే కాదు బీర్లు కూడా కరువైపోతున్నాయి. ఇప్పటికే ఎండాకాలం ప్రారంభంలోనే కొన్ని ప్రాంతాలలో నీటి ఎద్దడి ఏర్పడి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అయితే జరుగుతున్నది. తాగనీకే నీరు దొరక్క కొన్ని ప్రాంతాలలో ప్రజలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇట్లుంటే ఎండకు అలసి సొలసి ఉండి సేద తీర్చుకునేందుకు సాయంత్రం ఒక చల్లని బీరు తాగుదాం అంటే అది కూడా దొరకకుండా చాలా కష్టమైతున్నది. మన తెలంగాణల తీవ్రమైన నీటి కొరత కారణంగా ఈ బీరు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఇక గిట్లాంటి పరిస్థితులలో డ్రైవర్లు టిప్పర్ల యజమానులు వీళ్లంతా నిరాశపడుతున్నారు. ఓ పక్క తాగునీటి సమస్యలతోటి ఇంకోపక్క ఉపాధి లేక విలవిల బోతున్నారు కార్మికులు, జనాలు. ఇదంతా గిట్లుంటే మందుబాబులు కూడా బీరు ఉత్పత్తి లేక నిరాశ చెందుతున్నారు. మరోవైపు అసలు వర్షాలు కురిసే పరిస్థితులే ఎక్కడ కనిపిస్త లేవు. బీరు సరఫరా చేసేందుకు పెరుగుతున్న డిమాండ్లతోటి స్థానికంగా ఉన్న నీళ్లు సరిపోవడం లేదు. ఇక నీటి కొరత గింతగానం ఉంటే మరో రెండు నెలల్లో బీరు ఉత్పత్తి మొత్తం తగ్గుతుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. దీంతోనే ప్రభుత్వానికి ఆదాయం కూడా గండి పడే అవకాశం ఉందని చెప్తున్నారు. 1999లో ఒకసారి ఇటువంటి నీటి కొరత ఏర్పడితే అది కొంతకాలం మాత్రమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయం నుండి 4 బీరు తయారీ పరిశ్రమలకు నామమాత్రపు ధరకు 44 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసింది. ఇక ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల నుంచి తాగునీటి కేటాయింపులు సక్రమంగా జరుగుతలేవు. ప్రభుత్వం సింగూరు ప్రజల దాహార్తిని తీర్చకుండా బ్రూవరులకు నీటిని ఎలా సరఫరా చేస్తుందని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయట. జనాలకు తాగనీకనే నీళ్లు లేని పక్షంలో బీరు తయారీ పరిశ్రమలకు నీటిని ఎట్ల సరఫరా చేస్తారని కొందరు చర్చించుకుంటున్నారు. గీ కారణాల వల్లనే బీరు ఉత్పత్తి చేసే పరిశ్రమలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది. ఈ బీరు తయారీలో ఎన్నడు లేని విధంగా నీటి కొరత గడిచిన నాలుగేల్లు కనివిని ఎరుగని రీతిలో ఉందని ఉపాధి కోల్పోయిన బాధితులు చెప్తున్నారు. నగరం చుట్టూ ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గుముఖం పట్టడం వల్ల బీరు ఉత్పత్తి పైన తీవ్రమైన ప్రభావం చూపుతున్నదట. తాగునీటి ఎద్దడి కరువు కారణాలవల్ల సింగూరు మంజీర రిజర్వాయర్లలో నీటిమట్టం మరింత తగ్గుముఖం పట్టింది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ప్రైవేట్ వనరుల నుంచి నీటిని సేకరించడం చాలా కష్టంగా ఉన్నదట. దానికి కారణ ంగా యునైటెడ్ బృవరిస్ లిమిటెడ్, కార్లు బర్డ్స్, ఇండియా క్రౌన్ బీర్లకు, ఎస్ఏబీ మిల్లర్లకు, ఇండియా నీటిని సరఫరా చేయలేకపోతున్నారు దీంతోని బీర్ల ఉత్పత్తి తగ్గిపోయింది.
Comments