ప్రజాబలగం : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. అభ్యర్థి ఎంపిక పైన ఇయ్యాల కెసిఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్ ల సమీక్ష నిర్వహించిండు. ఈ సమావేశంలో హరీష్ రావు, కేటీఆర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మరోసారి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబానికి టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా శ్రీ గణేష్ పేరును ప్రకటించగా బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సమీక్షలో సాయన్న రెండో కూతురు దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లెలు నివేదితకు టికెట్ ఇయ్యాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థి పై కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక మే 13న పోలింగ్ జరగనుంది జూన్ 4న ఫలితాలు అయితే వెలువడనున్నాయి.
Comments