ప్రజాబలగం : ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణం రానే వస్తున్నది. ఈనెల 17 తారీఖున భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరగనున్నది. గీ వేడుకకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిండ్రు. ప్రతి ఏడు స్వామి వారి కళ్యాణానికి ఆ రామయ్య సీతమ్మ లను దర్శించుకోనీకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోతుంటారు. స్వామివారికి అమ్మవార్లకు చానా మంది విలువైన కానుకలను సమర్పించుకుంటారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ సీతమ్మ కోసం అరుదైన చీరను తయారు చేసిండు. రంగులు మారే 3d చీరను తయారు చేసిండు. ఐదున్నర మీటర్ల పొడుగు, 48 అంగుళాల వెడల్పు, ఉన్న గీ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు కష్టపడి బంగారము ,వెండి, ఎర్రని వర్ణాలతోనే, గీచీరని తయారు చేసినట్టు విజయ్ తెలిపిండు. గీచీరకు మొత్తం 48000 ఖర్చయిందట. ఈనెల 16న చీరను భద్రాచలం సీతమ్మ తల్లికి కానుక లెక్క అందించనున్నట్లు చెప్పిండ్రు. ఇగ సీతారాముల కల్యాణానికి సిరిసిల్ల నుండి సీతమ్మకు పెళ్లి చీర వెళ్ళనున్నది. ప్రతి ఏడూ కళ్యాణానికి చేనేత కళాకారుడు వెళ్లి హరిప్రసాద్ ఆనవాయితీగా సీతమ్మ తల్లి చీరనైతే పంపిస్తున్నాడు. ఈసారి తన చేనేత నైపుణ్యాన్ని ఉపయోగించి చేనేత మగ్గం మీద సీతారాముల కళ్యాణం జరిగే తీరు చీర అంచులలో భద్రాద్రి దేవాలయము లో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చే విధంగా చీరను నేసిండు. ఈ చీర మొత్తం శంకు, చక్ర నామాలతోనే, బార్డర్లో జైశ్రీరామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా చీరను అయితే తయారు చేసిండు.
Comments