సుర్రు మంటున్న సూర్యుడు తెలంగాణ రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్...


 ప్రజబలగం : ఎండాకాలం అనంగానే అందరికీ గుర్తుకొచ్చే నెల ఐదో నెల మే, కానీ గతంలో ఎన్నడు లేనట్టు ఈసారి మాత్రం ఏప్రిల్ మొదటి వారంలో నుంచే సూర్యుడు తన ప్రతాపన్న అయితే చూపిస్తున్నాడు. గిట్ల నిప్పులు కురిపిస్తున్న భానుడిని తట్టుకోలేక ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలను చూసి ఆరెంజ్ అలెర్ట్ అయితే జారీ చేసిండ్రు. ఇక ఎండలు మొదలవుతున్నాయి ఎండాకాలం వచ్చిందనంగానే ముఖ్యంగా సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ జిల్లాల బానుడైతే నిప్పులు కక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఈసారి ఉన్న ఎండల ప్రభావితం ఏందో గాని దాదాపు రాష్ట్రమంతటా 41.5 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలైతే నమోదు అవుతున్నాయి. ఇదంతా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పొద్దుగాల ఏడు గంటల నుంచి నిప్పులు కురిపిస్తున్నాడు ఈ భానుడు. ఇక విపరీతమైన ఎండలు, తీవ్ర వడగాలులు, ఉక్కపోతల తోటి ప్రజలు అయితే గడగడ ఉడికిపోతున్నారనుకోండి. ఇక ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయిల ఉష్ణోగ్రతలయితే నమోదు అయితున్నాయి మరి మే వచ్చేసరికి ఎండలు ఈ ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదు అయితయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఖమ్మం జిల్లాల మూడు రోజుల కిందట ఎండ తీవ్రత మస్తు పెరిగింది అదే కాకుండా ఇక శనివారం వరకు ఉష్ణోగ్రతలైతే ఉన్న మూడు రోజుల కంటే మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. ఎండలు గింత విపరీతంగ కొడుతుండటంతోటి తీవ్రమైన వడగాలు అయితే వస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లాల మునుగోడు ,యాదాద్రి భువనగిరి జిల్లాల వలిగొండ, బొమ్మరామారం మండలాల్లో తీవ్ర వడగాలులైతే వీస్తున్నాయి.సాధారణం కంటే ఆరు పాయింట్ ఒక్క డిగ్రీలు అదనంగా ఈ ఉష్ణోగ్రతలయితే నమోదు అయితున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ గడిచిన పడెండ్లల్ల ఎన్నడు లేనంతగా గింత ఉష్ణోగ్రతలు నమోదయి 42.8° ఎండగా వస్తుందడంతోటి తీవ్రమైన వడగాలులైతే వీస్తున్నాయట. ఎండలు మండిపోవడం తోటి ఇక వాతావరణ శాఖ అయితే ఒక చల్లని కబురు చెప్పింది. ఇక మన తెలంగాణ రాష్ట్రంల కొన్ని కొన్ని ప్రాంతాలలో ఇయ్యాల రేపు ఈదురు గాలులతోటి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇక ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయట గట్లనే కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే ప్రమాదం కూడా ఉందంట. ఈమెరకు తెలంగాణ రాష్ట్ర మంథట ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు మధ్య బయటికి వెళ్లకపోవడమే మంచిది అని చెప్తున్నారు. ఎప్పుడు లేనంత వేడిగా ఈసారి ఎండాకాలంలో వడగాలులతోటి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతారని అధికారులు  స్పష్టం చేశారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని జర ప్రజలందరూ చాలావరకు బయటకు పోయే ప్రయాణాలు మానుకొని జర ఎండలకు చల్లని పానీయాలను తీసుకొని  ఇంట్లో నుంచి బయటకు పోకుండా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులు సూచించారు.

Comments