ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకు పెరిగిన డిమాండ్... బిర్యానీ ఆర్డర్లతో హైదరాబాద్ టాప్


ప్రజాబలగం : కాలానికి తగ్గట్టుగా మనిషి కూడా రోజురోజుకు మారాలి అనేది ఈ వార్త చూస్తేనే అర్థం కావాలి. కరోనా కంటే ముందు జనాలు తిండికి ఇంత ప్రాధాన్యత ఇయ్యలేదు. ఇప్పుడు మాత్రం మన తిండి కంటే ఎక్కువ నా, మన పాణం కంటే ఎక్కువ నా, అన్నట్టుగా జనాలు మాత్రం తిననీకే ఎంత ఖర్చైనా సరే అసలే ఆలోచిస్తలేరు. ఇది ముందే పవిత్ర రంజాన్ మాసం ఇక దాదాపు ఈ మాసంలా 60 లక్షల మంది బిర్యానిలు ఆర్డర్లు పెట్టుకున్నట్టు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారం స్విగ్గి అయితే చెప్పింది. మామూలు నెలలతో పోలిస్తే బిర్యాని ఆర్డర్లు 15% పెరిగినయట ఈ ఒక్క నెలలోనే పది లక్షల బిర్యానీ 5.3 లక్షల హలీంలను ఆర్డర్ చేయడంల హైదరాబాదు అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది. నిజంగా చెప్పాలంటే ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే హలీం ను చానా ఇష్టంగా తింటుంటారు. అందులో భాగంగా హలీం తినేదాంట్ల ముస్లింల కంటే మన హిందువులే ఎక్కువనట. ఇక రంజాన్ సందర్భంగా సాధారణ రోజులతో పోలిస్తే దేశవ్యాప్తంగా ప్రసిద్ధ వంటకాలకు ఆర్డర్లు  చాలానే పెరిగినాయి. బిర్యానీ హలీంలతో పాటు సమోసాలు, బాజియా, మాల్మువ, పిర్ని, రబ్బి లాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా రికార్డు స్థాయిలోనే అమ్ముడైనయట. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్ సలార్డ్ సైతం భారీగా ఆర్డర్లైతే వచ్చినయ్. హలీము 1454.88% భారీగా పెరిగిందని ,పిన్ని 80.97% వృద్ధిలో రెండో స్థానంలో నిలిచిందట. మాల్మువ ఆర్డర్లో 79.09% పెరిగినాయి ఫలుదా 57.693% డేట్స్ ఏమో 48.40% పెరిగినాయి అని స్విగ్గిలు వెల్లడించినయ్. రంజాన్ మాసం సందర్భంగా ఇక సాయంత్రం ఐదున్నర నుంచి 7:00 వరకు ఇఫ్తార్ ఆర్డర్ల పైన 34 శాతం అయితే పెరిగిందట ఉపవాసాలు చేస్తున్న ముస్లింలు సైతం తమ దీక్షను విరమించేందుకు స్విగ్గిల లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లకి ఎక్కువ మొగ్గు చూపించిందట. గీ రంజాన్ పండుగ ఎఫెక్ట్ వల్ల ఏకంగా 10 లక్షల బిర్యానీ ఆర్డర్ల తోటి మన హైదరాబాదే టాప్ అంట.

Comments