చిన్నారి ప్రాణం తీసిన వీధి కుక్కలు


ప్రజాబలగం : ముందే ఎండాకాలం ఆయే అందులోనూ పిల్లలకు సగం పుట బడులు ఉన్నవి.ఇగ పిల్లలంతా ఆటలల్ల మునిగిపోతున్నారు.తాజాగా గాయత్రి నగర్ లో నిన్న సాయంత్రం ఇంటి బయట ఓ చిన్న రెండున్నర ఏండ్ల పాప ఆడుకుంటున్నది. ఆ పాప పేరు దీపాలి. గీ చిన్నారి పైన అక్కడే ఉన్న వీధి కుక్కలు దాడి చేసినవి. విది కుక్కల దాడిల గా చిన్నారి దీపాలకి చానా గాయాలు అయితే అయినవి. ఇక చికిత్స కోసం తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించిండ్రు. చికిత్స పొందుతున్న చిన్నార్రి ఇయాల ఆస్పత్రుల మృతి చెందింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్ పేట బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగినది. ఇగ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులు చేస్తున్నారు. వీధి కుక్కల దాడిల చిన్నారి మృతిచెందినందుకు ఈ ఘటన పైన స్థానికులు చాలా ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు. గి వీధి కుక్కల పైన ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చిన జిహెచ్ఎంసి అధికారులు ఒక్కసారి కూడా పట్టించుకున్న దాఖలాలే లేవని అక్కడ ఉన్న స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకొకసారి గీసువంటి ఘటనలు ఎక్కడ జరగకుండా వాటికి తగిన చర్యలు కచ్చితంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి దీపాలి కుటుంబం పాప మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు.

Comments