శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఎప్పుడంటే ?



తిరుమల తిరుపతి
: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు ఈనెల 21 నుండి మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. ఇగ వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారికి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టిటిడి తెలిపింది.  గురువారం రోజున స్వామివారిని 65570 మంది భక్తులు దర్శించుకున్నారు అంట. 24446 మంది భక్తులు తలనీలాలు సమర్పించిండ్రు. ఇగ స్వామివారి హుండి ఆదాయం అయితే 3.53 కోట్లు వచ్చిందని టీటీడీ కారులు వెల్లడించిండ్రు. ఇక తిరుమల లో భక్తుల రద్దీ అయితే ఎప్పుడు యధావిధిగా కొనసాగుతూనే ఉంటది. శ్రీవారి సర్వదర్శనానికేమో ఎనిమిది గంటల సమయం పడుతుంది. ఇగ మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొన్న భక్తులైతే శ్రీవారి దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతున్నది. మొత్తం 13 కంపార్ట్మెంట్ల భక్తులైతే వేచి ఉన్నారట.

Comments