నేను చాలా గర్వపడుతున్న.... కోటి ధన్యవాదాలు అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్.



ప్రజాబలగం
: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ సారు తన 26 ఏళ్ల సుదీర్ఘ పోలీసు ప్రస్థానానికి ముగింపు చెప్పి 2021 జూలైల పదవి విరమణ చేసిండు. బహుజన సమాజ్ పార్టీల చేరిండు. నాలుగు నెలల కిందట జరిగిన ఎన్నికలలో సిర్పూర్ నియోజకవర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యిండు. ఈ ఏడాది మార్చిల ఆ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. 2024 సార్వత్రిక ఎన్నికలల్ల నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలో ఉన్నారు. ఈ సారు ప్రభుత్వ సర్వీసుల ఉన్న సమయంలోనే గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థులతో స్వేరోస్ అని ఓ సంస్థను ఏర్పాటు చేసిండు. స్వేరోస్ అనేది సోషల్ వెల్ఫేర్ ఏరోస్. ఈ సంస్థ ద్వారా గురుకులంలా చదువుకుంటున్న విద్యార్థుల కోసం విరాళాలు సేకరించి వారి అభ్యున్నతినికి కృషి చేయడం. ఈ స్వేరోస్ కేవలం విద్యార్థుల అకాడమిక్స్ పైనే కాకుండా వారి కలలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, ఆటలలో కూడా విజయం సాధించనీకే చానా తోడ్పడుతున్నది. ఈ అంకిత కూడా ఇక్కడ నుంచే ఉన్నత స్థాయికి వెళ్ళింది. అసలు ఈ అంకిత అనే అమ్మాయి ఎవరంటే హైదరాబాదుకు చెందిన అంకిత అనే విద్యార్థిని తన ఎదుగుదలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కారణమని ఒక సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసింది. బస్తి నుంచి బెంగళూరుల అజిజ్ ప్రేమ్ జి యూనివర్సిటీలో చదువుకునేంతవరకు నేను ఎల్లగలిగిన అంటే దానికి పరోక్షంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే కారణమని ఆమె వెల్లడించింది. ఆరో తరగతిల సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో జాయిన్ అయినా అంకిత ఆకాశమే మీ హద్దు అని ఆర్ఎస్ ప్రవీణ్ సార్ నింపిన స్ఫూర్తి ఎనలేనిదని అన్నది. ఓ తండ్రి లాగా తనలాంటి ఎంతోమంది విద్యార్థులను చెయ్ పట్టి నడిపించారని ఆయన నాగర్కర్నూలు ఎంపీగా గెలిస్తే చానా మందికి సేవ చేస్తారని ఆమె మాట్లాడిన ఆ వీడియోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిండ్రు. ఇక అంకిత పెట్టిన పోస్టుకు ఆర్ఎస్ ప్రవీణ్ ఓ తండ్రి లాగా ఈరోజు గర్విస్తున్నాను నీకు చాలా థాంక్యూ నాన్నగా నువ్వు ఈరోజు నన్ను ఇంత గర్వపడేటట్టు చేసినందుకు ధన్యవాదాలు. మీలాంటి లక్షలాదిమంది పేద ఎనుకబడిన పిల్లలను గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదివి ఉన్నత స్థానాల్లో నిలబెట్టాలనే నేను సంకల్పించిన. ఇక నాగర్ కర్నూల్ నాకు అండగా నిలుస్తుందని ఆశిస్తున్నాను అని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేసుకున్నారు. ఇక సారు పార్టీలు మారినా గాని పేదోళ్ళ మీద ప్రేమ మాత్రం షాన్నే ఉన్నది.

Comments