హిందువులతో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందు




ప్రజాబలగం : రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులు సాయంత్రం వేళ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తారు. భారతదేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని వింటూనే ఉంటాం. దీన్ని నిజం చేస్తూ నిన్న బాలాజీ రెసిడెన్సి కాలనీ నాదర్గుల్లో హిందువులంత కలిసి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ విందులో భాగంగా వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఏ కులమతాలు లేవని మనుషులంతా ఒక్కటేనని, ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
విందులో భాగంగా ఆదిభట్ల ఎస్ఐ వెంకటేష్, ప్రెసిడెంట్ భాను ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ కె.చంద్ర శేఖర్, హుస్సేన్, షరీఫ్, నరేష్ జోసెఫ్, సత్యం ,ఈశ్వర్ ,రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Comments