.png)
ప్రజాబలగం : వాతావరణ శాఖ తెలుగు ప్రజలకు చల్లని వార్త తెలిపింది.తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు చెప్పింది.ఉత్తర కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు,ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు,ఈ ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఒకటి,రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు జల్లులు కురిసే సూచనలు ఉన్నాయట.ఈ ఉపరితల ద్రోణి ప్రభావం తెలంగాణలో కూడా ఉన్నందువల్ల మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, గద్వాల, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగాం, సిద్దిపేట్ జిల్లాలో విస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ ద్రోని ప్రభావం ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటి వరకు 40 డిగ్రీలకు పైగా నమోదైన ఈ ఉష్ణోగ్రతలు ఇవాళ 35 నుంచి 40 డిగ్రీల మధ్య రికార్డు అయ్యాయి. ఇక వచ్చే రెండు రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణలో జోగులాంబ జిల్లా వడ్డేపల్లిల 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిపింది. అనంతపురం, తాడిపత్రి, పొద్దుటూరు, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు కడప, పాణ్యం లో 42.7° గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఇంతటి చల్లటి వార్త వినిపించడంతో ప్రజలు కొంత ఈ వేడి ఒక మూడు రోజులపాటు ఉపశమనం దొరుకుతుందని భావిస్తున్నారు.
Comments