సోషల్ మీడియా తో తస్మాత్ జాగ్రత్త



ప్రజాబలగం : సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలవదు కానీ ఈ సోషల్ మీడియా  పిల్లలని మాత్రం నాశనం చేస్తుంది అననీకే గిడ జరిగిన సంఘటన ఒక ఉదాహరణ.హైదరాబాద్ సిటీలో జరిగిన ఘటన తల్లిదండ్రులను అందర్నీ అప్రమత్తం చేస్తుంది.హైదరాబాద్ సిటీల చిలకలగూడలో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. ఈ ఇంటి యజమానురాలు చెల్లెలి కూతురిని మంచి చదువుల కోసం ఊరు నుంచి సిటీకి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ అమ్మాయికి స్నాప్ చాట్ లో అర్జున్ రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యిండు. ప్రేమ దోమ అంటూ మాటలు కలిపిండు. ఈ ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయి కూడా ఈ అర్జున్ రెడ్డి వలల ప. గా పిల్లగాడు ఎట్ల చెప్తే అట్లా చేసింది. దీన్నే అవకాశంగా తీసుకున్న అర్జున్ రెడ్డి ఆ అమ్మాయి తోని మంచిగ  మాటలు కలిపి డబ్బులు కావాలని అడిగిండు. దీంతో ఆళ్ల పెదనాన్న ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం అంతా కొద్దికొద్దిగా తీసుకొని అర్జున్ రెడ్డికి చేరవేసింది. ఒకరోజు అమ్మాయి పెదనాన్న ఇంట్లో 3000 పెట్టి బయటకు పోయిండు, వచ్చి చూస్తే పైసలు లేవు ఇంట్లో ఉన్నది ఈ అమ్మాయి ఒక్కతే. దీంతో అనుమానం వచ్చిన పెద్దనాన్న ఇంట్లో బీరువా మొత్తం వెతికితే 16 తులాల బంగారం ఇంకా పెట్టిన పైసలు కనిపిస్త లేవు. ఇక వెంటనే అనుమానం వచ్చిన పెదనాన్న ఆ అమ్మాయి ఫోను పరిశీలించగా ఓ వ్యక్తి రెగ్యులర్గా మాట్లాడడం అతనికి పైసలు పంపించినట్లు మెసేజ్లు ఉండడం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పెదనాన్న పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. పోలీసులు అమ్మాయిని విచారించగ అర్జున్ రెడ్డి గుట్టు రట్టు అయ్యింది. గా అర్జున్ రెడ్డి ని చానా తెలివిగా పట్టుకున్నారు పోలీసులు. అతడి నుంచి బంగారం పైసలు అన్ని రికవరీ చేసిండ్రు. ఈ ఎనిమిదో తరగతి చదువుకుంటున్నా అమ్మాయి మైనర్ కావడంతో ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టిండ్రు. నిందితుడు అర్జున్ రెడ్డి పైన మాత్రం కేసు పెట్టి అరెస్టు చేసిండ్రు.స్నాప్ చాట్ ద్వారానే పిల్లలను వల వేసి పైసలు బంగారం దోసుకున్నాడని ప్రేమ పేరుతో మాయ చేసిండని పోలీసులు చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న పిల్లలపైన ఎప్పుడో కన్నేసి ఉంచాలని వాళ్ళకు ఫోన్లు ఇస్తున్నప్పుడు వాటిని బాగా పరిశీలించాలని పోలీసులు సూచిస్తున్నారు. గిట్ల ఉన్నది మరి సోషల్ మీడియా కథంతా.

Comments