ప్రజాబలగం : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం కోర్టు అనుమతితోనే అరెస్టు చేసి తీహార్ జైలు నుంచి మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించింది సిబిఐ. సోమారంతో సిబిఐ కస్టర్డ్ ముగియడంతో కవితను కోర్టులో హాజరు పరిచారు. కవితను అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్క దానికి కూడా సూటిగా సమాధానం చెప్పడం లేదని మూడు రోజుల కస్టడీలో కవిత విచారణకు సహకరించలేదని సిబిఐ అధికారులు కోర్టుకు చెప్పారు. ఆమెను ఇంకా విచా రించాల్సిన అవసరం ఉందని అందుకు 14 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిబిఐ కోరింది. అయితే సిబిఐ తరఫున లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు ఏప్రిల్ 23వ వరకు జ్యూడిషల్ కస్టడీ విధించినది. కల్వకుంట్ల కవితను మరో తొమ్మిది రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. ఇక కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన కవిత కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సిబిఐ కస్టడీ కాదు బిజెపి కస్టడీ అని మండిపడ్డది. బిజెపి వాళ్లు బయట అడిగేదే లోపల సిబిఐ అధికారులు అడుగుతున్నారని చెప్పింది. అడిగిందే అడిగి అడిగిందే అడిగి కొత్తగా అడగడానికి ఏం లేక రెండేళ్ల నుంచి మళ్లీ మళ్లీ అడుగుతున్నారని కవిత తెలిపింది.
Comments