ప్రజబలగం : తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. పెద్దపల్లి నుంచి బి ఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ తన ప్రచారంలో భాగంగా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని ఒకటవ బొగ్గు గని పై ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఉన్న కార్మికులను కలిసి ఓటు అడిగేందుకు వెళ్లిన ఆయనను సమస్యల పైన నిలదీశారు మహిళా కార్మికులు. సింగరేణిలోనే మహిళా కార్మికులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మా సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు అంటూ ప్రశ్నించారు. మాకు ఉన్న సమస్యలే పరిష్కరించకుండా మళ్లీ ఇప్పుడు ఎలా మీరు ఓట్లు అడిగేందుకు వస్తున్నారు అని ఆయనను నిలదీశారు. దీంతో కొప్పుల ఈశ్వర్ ఆ కార్మికురాల్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి వెనుకకు తిరిగి వెళ్లిపోయారు. ఇక కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేస్తున్న సంగతి తెలిసినదే.
Comments