లేడీ చైన్ స్నాచర్ల చేతివాటం


ప్రజాబలగం : అసలే బంగారం ధర రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి.తాజాగా  ఉప్పరపల్లి ప్రాంతంలో లేడీ చైన్స్నేచర్ హల్చల్. ఓ వృద్ధురాలు తన ఇంటి బయట కూర్చుని ఉండగా ఓ గుర్తు తెలియని మహిళ ఆమె వద్దకు వచ్చి మాటలు కలిపి వృద్ధురాలు మెడలో నుంచి 2.5 తులాల బంగారు గొలుసును దొంగలించినది. ఆ దొంగిలించిన మహిళను పట్టుకునేందుకు వృద్ధురాలు ప్రయత్నించి విఫలమైంది. వెంటనే ఆ వృద్ధురాలు బిగ్గరగా దొంగ దొంగ అని అరిచింది అరుపులు గమనించిన స్థానికులు ఆ చైన్స్చర్ కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. చైన్స్చర్ దొరకకపోవడంతో వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments