ప్రజాబలగం : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతన్నలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైనవి, ఇక జూన్ నెల కరి వరకు మూడు నెలల పాటు కొనుగోలు చేయాలని పౌరసరపరా సంస్థ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో నెలల వారిగా కొనుగోలు చేయాల్సిన దాన్యం అంచనాలు సిద్ధం చేసుకున్నది. ఇక రబీ సీజన్లో మొత్తం 75.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. మే నెలలో వడ్లు భారీ ఎత్తున ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. సుమారుగా 57% ఈ ఒక్క నెలలో కొనుగోలు చేయాల్సి ఉంటదని అధికారులు వారి టార్గెట్లో అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ లో 19,20,846 టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని అలాగే, మే నెలలో 42,83,58 టన్నులు, జూన్లో 13,36,461 టన్నులుగా టార్గెట్ పెట్టుకున్నారు. ఇక వరి ధాన్యం కొనుగోలు లో కేంద్రాల ప్రారంభించడంతో రైతన్నలు కోతలకు సిద్ధమయ్యారు. మార్చి తొలి వారంలో నల్గొండ నిజామాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో కోతలు మొదలైన రెండు మూడు వారం నుంచి జగిత్యాల, జనగామ ,నిర్మల్ జిల్లాల్లో కోతలు ప్రారంభమైనవి. ఇక రాష్ట్రంలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సిరిసిల్ల, కొత్తగూడెం, నారాయణపేట ,వరంగల్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. మిగతా జిల్లాల్లో 3 నుంచి 4 వారాల్లో కోతలు ప్రారంభం కానున్నాయి.
Comments