ప్రజాబలగం: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటిసారి లోక్ సభ ఎన్నికల సమరంలో ఊపందుకున్నది. నిన్న సాయంత్రం తుక్కుగూడల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర భారీ బహిరంగ సభల సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పైన ఘాటైన వ్యాఖ్యలు చేసిండ్రు. మొన్న జరిగిన సిరిసిల్లలో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో విరుచుకబడ్డడు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జాతీయ నేతలు మున్షీ, కె. సి వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా జాతీయ మేనిఫెస్టోలోని ఐదు గ్యారంటీలను విడుదల చేశారు. రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ సభలో పాల్గొనగ.ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ భాష సరిగ్గా లేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు తనను వెంట్రుక కూడా పీకలేరు అంటూ కేసిఆర్ అంటున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేకుండా లాగేయగలరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నాడేమో తాను జానారెడ్డి కాదు రేవంత్ రెడ్డి నంటూ గుర్తు చేసిండ్రు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే అంగీలాగు ఊడదీసి చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చిండు. యోగి సందర్భంగా నే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులు వస్తే ఎక్కడ వండ పెట్టాలంటూ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తానని తెలంగాణ ప్రజలకు ఇప్పటివరకు కట్టేయలేదు కానీ ఇక కెసిఆర్ కు మాత్రం విద్య అల్లుడు కొడుకు అందరికీ కలిసి నేను తలుచుకుంటే నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గిన్న తలుచుకుంటే చెర్లపల్లి జైలుల డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని తీవ్ర స్థాయిల వ్యాఖ్యలైతే చేసిండ్రు. పదేండ్ల అధికారం చేతుల పెట్టుకొని తెలంగాణను మొత్తం దోపిడి దొంగలుగా అడవి పందులు లాగా అడ్డగోలుగా దోచుకుంటూ, 10 నల్లనే ఉంది విధ్వంసం మొత్తం సృష్టించినరని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ఉత్తగనే అనుకుంటున్నాడేమో మొన్నటి వరకు పోనీ పాపం అని ఏమనకుండా జాలి అయితే చూపించినాము కానీ ఇప్పుడైతే ఊకునేదే లేదు. ఇగ గిట్ల మాజీ సీఎం కేసీఆర్ మీదనే కాకుండా బిజెపి పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు అయితే జరిగిండ్రు. ఇక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను తుక్కుతుక్కుగా ఓడించినం ఇప్పుడు వచ్చే లోక్ సభ ఎన్నికల బిజెపిని కూడా గంతే ఉత్సాహంతోటి కచ్చితంగా ఓడించే తీరుతామని రేవంత్ రెడ్డి అన్నారు. పదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏం చేసింది దేశానికి అని ప్రశ్నించిండు. మతం అనే పేరుతోటి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం చేపట్టాలని మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించిండు.
Comments