ప్రజాబలగం : ఆడవాళ్లకు అలంకారం అనగానే మొదటగా గుర్తుకొచ్చేదే బంగారం. అందులోనూ భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారమే. మహిళలు బంగారు ఆభరణాలను ధరించాలంటే చాలా ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం ధరించడానికి పేద మధ్యతరగతి అని తేడా లేకుండా కుటుంబాలతో బంధం, రేపటి అవసరాలకు ఉపయోగపడుతుందని ఆలోచనతోటి పైసా పైసా కూడబెట్టి మరి బంగారం కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం బంగారం అంటేనే గుండెల్లో దడ పుట్టిస్తుంది .ఎందుకో తెలుసా ఇప్పుడు రేట్లు చూస్తుంటేనే భయపడాల్సిస్తోంది. అసలు బంగారం కొనగలమా అన్న ఆలోచనలో ఉంటున్నారు. బంగారం ధరలో రోజురోజుకు పెరిగిపోతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. అసలు తగ్గుతాయి అంటే చెప్పలేని పరిస్థితి సామాన్యులకు అందకుండా రికార్డు గరిష్టల్లోకి బంగారం ధరలు. కొద్ది రోజుల నుంచి వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.
గడిచిన 5 ఏళ్లలో చూస్తే సంవత్సరానికి బంగారం రేట్లు భారీగా పెరుగుకుంటూ వస్తున్నాయి. 2019లో బంగారం రేటు 24 క్యారెట్ల పైన తులానికి 35 వేల 220గా ఉండగా, 2020లో రూపాయలు 48,6501 చేరింది. తర్వాత 2022లో 52670 ,తర్వాత 2023లో తులం బంగారం 6530 కి చేరగా ,2024 లో మాత్రం 73,150 కి పెరిగింది. ఇలా రోజురోజుకు పెరుగుతూ వస్తున్న పసిడి ధరలను చూసి, కొత్త ఆకృతలతో బంగారాన్ని ఎక్కువగా 22 క్యారెట్ల బంగారంతో చేస్తుంటారు కానీ ఈ ధరలు అందనంత ఎత్తుకు చేరేసరికి ఆభరణాల తయారీదారుల వ్యూహం మార్చేశారు. ఇక 22 క్యారెట్లు కాకుండా 16 ,18 క్యారెట్ల తోనే అధునాతన డిజైన్లను రూపొందిస్తున్నారు. ఇక వీటిని కూడా భరించలేని వారు గ్రాము బంగారం మాత్రమే కొంటున్నారు. ఎక్కువ ఆదాయ వర్గాల వజ్రాభరణాలకే మొగ్గుచూపుతున్నారు. ఇక చాలామంది కొద్ది రోజుల ముందు కొందామని చూస్తున్నామని ఇప్పుడు పసిడి ధరలు చూస్తుంటే అసలు కొనగలమా అని భయమేస్తుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులానికి 73 150 పలుకుతోంది. కానీ రోజుకో ఆల్ టైం రికార్డు నమోదు చేస్తోంది. నాలుగైదు రోజుల్లోనే ఏకంగా మూడు వేలకు పైగా పసిడి ధర ఆకాశాన్ని అంటుతోంది. ఈ పెరగడం ఇక్కడికే ఆగుతుందా లేదంటే ఇంకెక్కడికో చేరుతుందా అని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇలా పసిడి ధరలు రోజురోజుకీ పెరిగికుంటూ పోతుంటే చుక్కలు చూపిస్తున్నాయని అసలు తగ్గుతాయి అంటే చెప్పలేని పరిస్థితి ఉందని సామాన్యులు కొనాలంటే ఇక కొనలేని స్థితిలో భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశ మహిళలో బంగారానికి మంచి డిమాండ్ ఉండే పండగలు వివాహాది శుభకార్యాలు సహా ఇతర వేడుకల సమయంలోనూ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ధరలు చూశాక కొనడానికి అసలు సాహసమే చేయలేను అంటున్నారు మహిళలు. అసలు ఈ బంగారం ధర పెరగడానికి యు ఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఈ ఏడాదిలో కనీసం మూడుసార్లు తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చిన నేపథ్యం వల్లనే ఈ ధర పెరుగుతోందని ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Comments