కేంద్రంలో మేము అధికారంలోకి రాగానే ...తెలంగాణ యువతకు లక్ష జీతంలో ఉద్యోగాలు 50 వేల జాబ్స్ త్వరలో


ప్రజా బలగం:- నిన్న తుక్కుగూడ లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జన జాతర సభలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుభవార్త వినిపించిండు. రాష్ట్రంల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులల్ల 25 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసినమని గుర్తు చేసిండు. ఇక త్వరలో ఇంకొక 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తామని ప్రకటించిండు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోలో ఉన్న ఐదు గ్యారంటీలను రిలీజ్ చేసిండ్రు ప్రజల మనసు నుంచి పుట్టిందే తమ మేనిఫెస్టో అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చిండు . గత కొన్ని నెలల ముందు ఇదే తుక్కుగూడలా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించామని ఇప్పుడు మల్ల జాతీయ మ్యానిఫెస్టో రిలీజ్ చేసేందుకు వచ్చానని తెలిపిన ఆయన అప్పుడు ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే వాటన్నింటినీ అమలు చేస్తున్నాం ఇక తెలంగాణ రాష్ట్రంల హామీలను అమలు చేసినట్టే జాతీయ స్థాయిలోనూ కచ్చితంగా అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిండు యువతకు అన్ని రంగాల్లో శిక్షణ కూడా ఇప్పిస్తామని తెలిపిన ఆయన మహిళ న్యాయం ద్వారా మహిళలకు ఏటా లక్ష్యం మొత్తాన్ని నేరుగా బ్యాంకులో జమ చేస్తామని చెప్పిండు. నారీన్యాయతో దేశముఖ చిత్రం కచ్చితంగా మారుతుందని తెలిపిండు. కార్మికులకు జాతీయ స్థాయిలో కనీస కూలీకి రోజుకు 400 పెంచుతామని వివరించిండు. పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పుకొచ్చిండు. ఈ ఐదు న్యాయ సూత్రాల ద్వారా దేశంలో ఒక్క కుటుంబానికి ఏటా లక్ష రూపాయలు ఆదాయం కంటే తక్కువ ఉండబోదంటు రాహుల్ గాంధీ అయితే చెప్పుకొచ్చిండు. ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు. మోడీ అధికారంలోకి వచ్చినంక దేశ ప్రజలు నిరుపేదలయ్యారని తెలిపారు. నిత్యం మన దేశంలో 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక తాము అధికారంలోకి రాంగనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. దేశంలో 50 శాతం మంది వెనుకబడిన వర్గాలే ఉన్నారని రైతులకు మాత్రం మోదీ రూపాయి కూడా మాఫీ చేయలేదని కానీ ధనవంతులకు మాత్రం 16 లక్షల కోట్లు మాఫీ చేసిండని చెప్పుకొచ్చిండ్రు బడుగు బలహీన వర్గాల జనాభా 50% ఉంటే ఆదాయం మాత్రం కేవలం ఐదు శాతం ఉందని చెప్పుకొచ్చిన్రు.

Comments