దానం నాగేందర్ పై ఫైర్ అయిన కేటీఆర్.20 కోట్లు విలువ చేసే భూమి కబ్జా అంటూ ఆరోపణ.


ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి ఇప్పుడు గా పార్టీకి టాటా చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. గిప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిండు. దానం నాగేందర్ పార్టీ మారింది ఆయన సొంత ప్రయోజనాల గురించేనని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నేతలు అయితే విమర్శిస్తున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దానం పైన సంచలన ఆరోపణలు అయితే చేసిండ్రు. దానం నాగేందర్ ఏమి సత్య హరిశ్చంద్రుడు కాదు సొంత స్వలాభం గురించే పార్టీ మారిండని చెప్పిండ్రు. ఇక బిఆర్ఎస్ ను విడిచిపెట్టి కాంగ్రెస్ లోకి చేరంగనే బంజార హీల్స్ లా తన ఇంటి వెనక  ఉన్న ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా కూడా పెట్టిండు అని ఆరోపించిండు. బిఆర్ఎస్ పార్టీల ఉన్నప్పుడు కూడా గా నాలా కబ్జా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసిండని, కానీ మేము మాత్రం కబ్జా కానీయలేదని చెప్పుకొచ్చిండు. గిప్పుడు గా భూమి కాడికి పోయి చూస్తే ప్రభుత్వ భూమి అనే బోర్డు మాయం చేసి ఇక గా స్థలాన్ని కబ్జా చేసి ఆ స్థలాన్ని ఆయన ఉంటున్న ఇంట్లోనే కలుపుకున్నాడని ఆరోపించిండు. 700 గజాల స్థలం కబ్జా చేసి అందుకు సంబంధించిన ఫుటేజ్ లను కావాలంటే మేము ఇస్తామని చెప్పుకొచ్చిండు. ఇదంతా రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా తీసుకొని దానం నాగేందర్ పార్టీ మారిండు పార్టీ మారేవారు ఏదో కారణం వెతుక్కుంటారని అందుకే మాపైన ఏవేవో మాట్లాడుతున్నారని దానం నాగేందర్ పైన కేటీఆర్ అయితే మస్తుగా ఫైర్ అయ్యిండు. గి ముచ్చటంత గిట్ల ఉంటే గతంలోనే ఈ భూ ఆక్రమణపైన షేక్ పేట మండలంలో తాసిల్దారు అనితారెడ్డి ఈ స్థలం గురించి గతంలోనే వివరణ ఇచ్చిందట. ఎమ్మెల్యే నివాసం వెనకాల ప్రహరీ గోడ కట్టి దాంతోపాటు రేకుల షెడ్డు ఏర్పాటు చేసినట్టు గుర్తించామని కానీ గా గోడలు తాత్కాలికమైననే నిర్మాణ సామాగ్రి ఉన్నందుకే వాటి రక్షణ కోసం కట్టినట్టు ఇగ పనులన్నీ పూర్తయిన తర్వాత గ గోడలు తీసేస్తామని ఎమ్మెల్యే దానం సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం తోని ఇంకా వాటిని తొలగించలేదని చెప్పిండ్రు. ఇగ దానం నాగేందర్ కబ్జా పెట్టిన భూమి ఖరీదు అయితే 20 కోట్లు ఉంటదని కేటీఆర్ సార్ అయితే పేర్కొన్నారు.

Comments