100 రోజుల్లో మీ గ్యారెంటీలను బొంద పెట్టిండ్రు... ప్రజలను మోసం చేసిండ్రు.


ప్రజాబలగం : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల నాయకులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. అందులో భాగంగానే బిజెపి అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి మొన్న జరిగినటువంటి తుక్కుగూడ కాంగ్రెస్ జన జాతర సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఒక దిక్కుమాలిన మేనిఫెస్టో అని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు తయారయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఆ 6 గ్యారంటీలను బొందపెట్టిన్రని రాణి రుద్రమ మండిపడ్డారు. గత ఎన్నికల్లో 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి గెలిచిండ్రు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఐదు గ్యారంటీలను తెచ్చి మళ్ళీ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి గెలవాలని అనుకుంటున్నారు. కానీ ప్రజలు పిచ్చివాళ్లు కాదని ఒక్కసారి నమ్మి ఓటు వేసి మోసపోయాక మళ్లీ ఓటు వేసి గెలిపించేంత మూర్ఖులు కాదని ఆవిడ చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు మోడీకే ఓటు వేయాలని చూస్తున్నారు.రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకొని ఇయ్యాలటి నుంచి హెలికాఫ్టర్లు కార్లు వాడకుండా కాలినడకననే పరిపాలన సాగించాలని కోరారు ఆవిడ. ఒక దిక్కు రైతులు ఆగమైతుంటే ఉప్పల్ స్టేడియంలో కూర్చొని క్రికెట్ చూసుకుంటా రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మొత్తం ఆగమయిందని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు న్యాయాలు కనపడని ఆత్మలాంటిమని ఆవిడ విమర్శించిన్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలల్లా ఉచిత బస్సు ప్రయాణం తప్ప చేసింది ఏమీ లేదని ఆర్టీసీ ఉచిత ప్రయాణంతోటి ఆర్టీసీ సంస్థ మొత్తం దివాలా తీసే పరిస్థితులు తీసుకొచ్చిందని తెలిపారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు ఏం చేశారో ముందు ప్రజలకు చెప్పి తర్వాత రేవంత్ రెడ్డి ఓట్లు అడగాలని పేర్కొన్నారు. గడిచిన పదేళ్ల పాలనలో మోడీ ఒక సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసింది అని రాని రుద్రమదేవి చెప్పుకొచ్చారు. యువ న్యాయ గ్యారంటీలో పొందుపరిచిన గిగ్ ఉద్యోగత అంటే ఏందో అసలు రేవంత్కు తెలుసా? అని ప్రశ్నించారు. పదేళ్లల్లా కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి ఓపెన్ డిబేట్ కు రావాలన్నారు ఆవిడ. కరోనా కష్టకాలంలో ఆత్మ నిర్భర్ భారత్ తో ప్రతి ఒక్క పౌరుడికి మోడీ భద్రత కల్పించారు. గత పదేండ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను తామే ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నది. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కట్టి చూపించాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయని ఆరోపించారు. గాంధీలు తప్ప కాంగ్రెస్ లా ఏ సామాజిక వర్గం కూడా ఇప్పటివరకు బాగుపడిందే లేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ నేతలంతా సిగ్గుపడాలని రానీ  రుద్రమదేవి అన్నారు. మోడీ బిసి, కాంగ్రెస్లా బీసీ ముఖ్యమంత్రి , బీసీ ప్రధానమంత్రి ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇచ్చిన గ్యారంటీల పైన దృష్టి పెడితే బాగుంటుంది అని అన్నారావిడ. కాంగ్రెస్ బిఆర్ఎస్ ఇద్దరూ కలిసి ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నం చేస్తే బిజెపిగా అస్సలు ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేంతవరకు వెంటాడుతూనే ఉంటామని ఆమె పేర్కొన్నారు.

Comments