బిఆర్ఎస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే కీలక పదవి... మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్

కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ గారికి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా ఉప్పల వెంకటేష్ గారిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది, ప్రస్తుతం మిషన్ భగీరథ చైర్మన్ గా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఉన్నారు, బిఆర్ఎస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే కీలక పదవి...ఇటీవల కేటీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన ఉప్పల వెంకటేష్ గారు మాట్లాడుతూ... నా తల్లి పై ప్రమాణం చేస్తున్నాను ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీ లోనే ఉంటా... నేను చేస్తున్న సేవలను, నన్ను గుర్తిస్తే చాలు అంటూ చాలా ఎమోషనల్ గా కేటీఆర్ గారి సమక్షంలో మాట్లాడిన విషయం మన అందరికీ తెలిసిందే, ఆయన సేవలను గుర్తించిన మంత్రి కేటీఆర్ గారు పార్టీలోకి వచ్చిన కొత్తలోనే కచ్చితంగా గ్యారెంటీగా పెద్ద పదవి ఇస్తానని హామీ ఇచ్చారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టుగా తెలుస్తుంది, రెండేళ్లు ఈ పదవిలో ఉండనున్నారు. అదే నియోజకవర్గానికి చెందిన గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఇటీవల ఫుడ్ కమిషన్ చైర్మన్ గా నియమించిన విషయం తెలిసింది తెలిసిందే, కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీలో ఫుల్ జోష్.. పదవులతో కల్వకుర్తిలో పతారా... ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నీ మూడోసారి కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించినప్పటి నుంచి కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఫుల్ జోష్ గా ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూచన మేరకు కల్వకుర్తి నియోజకవర్గం లో గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యనేతలకు ప్రాధాన్యత ఉండేలా చొరవ తీసుకుంటారు.

Comments