మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు & శంకుస్థాపనలు చేసిన మంత్రి సబితా ఇంద్ర రెడ్డి

మహేశ్వరం నియోజకవర్గం,మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 09,05,16 డివిజన్ లలో 2 కోట్ల 38 లక్షలు రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి సబితాఇంద్రా రెడ్డి గారు. ఈ సందర్బంగా మీర్పేట్ 16 వ డివిజన్ కార్పొరేటర్ అనిల్ యాదవ్ గారి ఆధ్వర్యం లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మీటింగ్ లో కార్పొరేటర్ అనిల్ యాదవ్ మాట్లాడుతూ మన మహేశ్వరం నియోజకవర్గం, మీర్పేట్లో మంత్రి సబితమ్మ గారు చెరువులు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పార్కుల నిర్మాణం, ముక్యంగా నా 16 వ డివిజన్ పరిధిలో ఇండ్ల పట్టాలు, సీసీ రోడ్లు, మంచినీటి సదుపాయాలు, గ్రంధాలయాలు, కమ్యూనిటీహాలు, ఓపెన్ జిమ్లు, ఇలా 2 కోట్లకు పైగా నిధులతో నా డివిజన్ అభివృద్ధికి సహాయపడ్డారు, మరోసారి కూడా మంత్రి సబితాఇంద్రా రెడ్డి గారినే గెలిపించుకొని మీర్పేట్ పరిధిలోని అన్ని డివిజన్లను మరెంతో అభివృద్ధి చేసుకుంటామని కార్పొరేటర్ అనిల్ యాదవ్ గారు మాట్లాడారు. ఈ సందర్బంగా మంత్రి సబితాఇంద్రా రెడ్డి గారు మాట్లాడుతూ నన్ను అమ్మ, అమ్మ అంటూ కొట్లాడిమరీ, పనులు జరగాలి అంటూ నా వెంటబడి నాతో 16 వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకున్నాడు. ఇలాంటి వ్యక్తి మీ16 వ డివిజన్ కార్పొరేటర్గా ఉండటం మీ అదృష్టం అని ఆవిడా స్వయంగా చెప్పారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా సబితాఇంద్రా రెడ్డి గారు,మున్సిపల్ మేయర్ దుర్గ గారు, డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి గారు,ఫోర్ లీడర్ భూపాల్రెడ్డి గారు,మీర్పేట్ కార్పొరేషన్ brs పార్టీ అధ్యక్షుడు అరికెల కామేష్ రెడ్డి గారు,పలువురు మరియు తదితరులు పాల్గొన్నారు.

Comments