మీర్పేట్ బిజెపి 25వ వార్డు కార్పొరేటర్ కీసర గోవర్ధన్ రెడ్డి.... జన్మదిన వేడుకలు.....

మీర్పేట్ కార్పొరేషన్ 25వ వార్డు కార్పొరేటర్ కీసర గోవర్ధన్ రెడ్డి...జన్మదిన వేడుక‌లు సోమవారం ఆయన నివాసంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. కీసర గోవర్ధన్ రెడ్డికి శుభ‌కాంక్ష‌లు తెలిపిన వారిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందెల శ్రీరాములు యాదవ్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, మీర్పేట్ మరియు బడంగ్పేట్ కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు త‌దిత‌రులు, కీసర గోవర్ధన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కీసర గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా 25వ వార్డు ప్రజలకు నేనెప్పుడూ రుణపడి ఉంటానని, నన్ను నమ్మి గెలిపించిన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మరికొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అవి కూడా త్వరలో పూర్తి చేస్తానని తెలియజేశారు.

Comments