తొలిసారి భారత్కు బైడెన్ జీ ట్వంటీ సదస్సుకు ముస్తాబైన ఢిల్లీ..

G- 20 సదస్సుకు ఢిల్లీ ముస్తాబైంది. దేశాధినేతల రాకతో హస్తిన నగరం కళకళలాడుతోంది. విభిన్న సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశంలో జరుగుతున్న జీ 20 సదస్సుకు ఎంతో ప్రత్యేకత ఉంది. రష్యా, చైనా అధ్యక్షులు ముఖం చాటేసినా.. వసుదైక కుటుంబంగా భావించిన అందరినీ సాదర స్వాగతం పలుకుతోంది దేశం. శని, ఆదివారాలు జరగనున్న జీ20 సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది. దేశాధినేతలు ఒక్కొక్కరుగా దిల్లీలో అడుగుపెడుతున్నారు. కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశాయి. అంతకుమించిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నగరాన్ని ముస్తాబు చేశారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ఢిల్లీ జీ20 వేదికగా పరిష్కారం రాబోతుంది. జీ20 సదస్సులో ఒకప్పుడు గ్లోబల్​ ఎకానమీపైనే దృష్టి సారించేది కానీ.. ఇటీవల కాలంలో ఆర్థిక వ్యవస్థతో పాటు ట్రేడింగ్​, సుస్థిరాభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఎనర్జీ, పర్యావరణం, వాతావరణ మార్పులపైనా ప్రధానంగా ఫోకస్ పెడుతోంది. భారత్‌లోనూ సరికొత్త అంశాలు అజెండాలో ఉండబోతున్నాయి. గతానికి భిన్నంగా 80 నగరాల్లో భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో వివిధ రంగాలపై సమావేశాలు నిర్వహించింది. ఫిబ్రవరి నుంచి ఇప్పిటిదాకా వందకు పైగా సమావేశాలు జరిగాయి. టూరిజం, వ్యవసాయం, పరిశ్రామిక రంగాల్లో అనేక ఒప్పందాలు జరిగాయి.

ఇప్పుడు జరుగుతున్న జీ20 సదస్సుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చైనాపై కరోనా ఆరోపణలు.. ఉక్రెయిన్‌పై రష్యాల దాడుల నేపథ్యంలో భారతదేశానికి ఈ శిఖరాగ్ర సదస్సు కత్తిమీద సాములా మారిందన్నది అంతర్జాతీయ నిపుణుల వాదన. అయితే ద్వైపాక్షిక సంబంధాలుపై ప్రభావం పడకుండా భారత్‌ తనదైన శైలిలో చూపిస్తోంది. ప్రపంచ దేశాల్లో 5వ ఆర్ధిక వ్యవస్ధగా, జీ20లో నాలుగో ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్‌ ప్రాముఖ్యతను మరోసారి G20 సదస్సు చూపించబోతుందా? దేశ కీర్తి ప్రతిష్టలను మరో ఎత్తున నిలబెడుతుందా?

 

Comments