భారత్ నిషేధం ప్రపంచం లో టెన్షన్ పుట్టిస్తుంది...

ప్రపంచంలో టెన్షన్‌ పుట్టిస్తోంది.. రికార్డ్‌ స్థాయికి బియ్యం ధరలు

ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణం కారణంగా వంటగది బడ్జెట్ క్షీణించింది. కాగా, గత కొద్ది రోజులుగా భారత్ బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది.


చాలా దేశాల్లో బియ్యం ధరలు భారీగా పెరిగాయి. గత వారంలో భారతదేశం పారాబాయిల్డ్, బాస్మతి బియ్యంపై ఆంక్షలు విధించింది. బుధవారం ఆసియాలో బియ్యం ధరలను 15 సంవత్సరాల గరిష్ట స్థాయికి నెట్టివేసింది. అయితే రైస్‌తో పాటు మరికొన్ని ఆహార ధాన్యాలపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం కూడా జూలై 20 నుంచి మొదలైంది. దీని తరువాత అనేక రకాల బియ్యం ఎగుమతిపై నిషేధం విధించబడింది. ప్రపంచంలోనే బియ్యం ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ ఒకటి. దీని తరువాత థాయిలాండ్, వియత్నాం వంటి దేశాలు ఉన్నాయి.


బియ్యం విషయంలో ప్రపంచంలో ఉన్న ఆందోళన ఏమిటి?


ఎకానమీ టైమ్స్ నివేదిక ప్రకారం.. హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎమెరిటస్ పీటర్ టిమ్మర్ మాట్లాడుతూ.. బియ్యం ధరల పెరుగుదల తరచుగా పేద వినియోగదారులను ఎక్కువగా దెబ్బతీస్తుంది. ప్రస్తుతం భారత్‌పై థాయ్‌లాండ్‌, వియత్నాం ఆంక్షలు విధిస్తే ప్రపంచవ్యాప్తంగా బియ్యం ధర 1000 డాలర్లు దాటే అవకాశం ఉందని ఆయన అన్నారు.


ఇప్పుడు బియ్యం ధర ఎంత?


గ్లోబల్ మార్కెట్‌లో బియ్యం బెంచ్‌మార్క్ ధర ప్రస్తుతం టన్నుకు $ 646, తక్కువ వర్షాలు కారణంగా, బియ్యం ధర మరింత పెరిగే అవకాశం మెండగా ఉంది. థాయ్‌లాండ్ ఈసారి కరవును హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్కడ ధరలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో పంట బాగా పండింది. ప్రపంచం ఇక్కడ నుంmr ఉపశమనం పొందవచ్చు.


భారత్ ఎందుకు నిషేధించింది:


భారతదేశం గురించి మాట్లాడితే.. దేశంలో బియ్యం ధర గత సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. న్యూఢిల్లీలో కిలో బియ్యం ధర రూ.39. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న బియ్యం ధర కారణంగా ఎగుమతి సుంకం పెంచడం, నిషేధించడం జరిగింది.

 

Comments