తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. విమర్శలకు, కోర్టు కేసులకు తాను భయపడేదాన్ని కాదని.. ప్రొటోకాల్ ఉల్లంఘనలతో కట్టడి చేయలరేని అన్నారు. అలాగే నా బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నానని అన్నారు. అయితే ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవాలని.. లేదా కోట్లాడాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. గవర్నర్‌గా నాలుగు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా రాష్ట్ర ప్రజల సేవలో 5వ ఏడాది ప్రారంభం పేరిట శుక్రవారం రాజ్‌భవన్‌లో కాఫీ టేబుల్‌బుక్‌ను ఆమె ఆవిష్కరించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలకు 15 శాతం మాత్రమే సేవలు అందించాలని.. ఇంకా చేయాల్సింది కూడా ఎంతో ఉన్నప్పటికీ రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అనుభవం, ముందుచూపు ఉన్న నాయకుడు అని తెలిపారు. కేసీఆర్‌ను చూసి చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు. అలాగే రాజ్‌భవన్, ప్రగతిభవన్‌కు మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే సచివాలయానికి వెళ్లానని అన్నారు. ఇక తెలంగాణలో నేను ప్రజలను కలిస్తే రాజకీయం చేస్తున్నానంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే పుదుచ్చేరిలో ప్రతినెల 15వ తేదీన అక్కడి ప్రజలను కలుస్తున్నానని.. ఆ ప్రాంతంలో అధికారులు తనకు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారమయ్యే రాజకీయ విమర్శలను తాను పట్టించుకోనని చెప్పారు. మరోవైపు తాను ప్రభుత్వంతో పోరాడటం లేదని.. మా మధ్య కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. నా వద్దకు ఏ బిల్లుపై కూడా అలా గుడ్డిగా సంతకం చేయలేనని పేర్కొన్నారు. ఆ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
Comments